Hydra : హైడ్రా కూల్చివేతలను ఇప్పటికిప్పుడు ఆపలేం: హైకోర్టు
Hydra : అక్రమ కట్టడాల కూల్చివేతలకు 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని పాల్ కోరారు. వెంటనే హైడ్రా కూల్చివేతలను ఆపివేయాలని వాదించారు. జీఓ నంబర్ 99పై స్టే విధించాలని కేఏ పాల్ హైకోర్టులో వాదించగా.. ఇప్పటికిప్పుడు కూల్చివేతల్ని ఆపలేమని న్యాయస్థానం పేర్కొంది.
- By Latha Suma Published Date - 01:23 PM, Fri - 4 October 24

Telangana High Court : హైడ్రా కూల్చివేతలను ఇప్పటికిప్పుడు ఆపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా కూల్చివేతలపై స్టే విధించాలని కేఏ పాల్ వేసిన పిటిషన్‌పై శుక్రవారం(అక్టోబర్4) హైకోర్టు విచారణ జరిపింది. హైడ్రాకు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని కోర్టులో కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు. అక్రమ కట్టడాల కూల్చివేతలకు 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని పాల్ కోరారు. వెంటనే హైడ్రా కూల్చివేతలను ఆపివేయాలని వాదించారు. జీఓ నంబర్ 99పై స్టే విధించాలని కేఏ పాల్ హైకోర్టులో వాదించగా.. ఇప్పటికిప్పుడు కూల్చివేతల్ని ఆపలేమని న్యాయస్థానం పేర్కొంది. ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా ఉన్న హైడ్రా, ప్రభుత్వానికి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.
Read Also: KTR : రాష్ట్రంలో రుణమాఫీ..అంతా డొల్లతనమే: కేటీఆర్
కాగా, హైదరాబాద్ లో చెరువులు, నాలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను గుర్తించి.. వాటిని కూల్చివేయడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది. అయితే దీని ఫలితం పేదలపై కూడా తీవ్రంగా పడుతోంది. ఎవరో అమ్మితే తాము కొనుక్కుని కట్టుకుళ్ల ఇళ్లను కూల్చివేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే హైడ్రా కూల్చివేతలను ఆపివేయాలని వాదించారు.
ఇకపోతే..తెలంగాణ ప్రభుత్వం ఈఏడాది జూలై 19న జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రంగంలోకి దిగిన హైడ్రా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. మొదట్లో హైడ్రాకు అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ రానురాను హైడ్రాపై నిరసనలు వెల్లువెత్తాయి. పలు చోట్ల హైడ్రా కూల్చివేతలను స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. హైడ్రాకు చట్టబద్ధత ఉందా, లేదా? అని కొంతమంది ప్రశ్నలు సంధించారు. హైడ్రాను నిలిపివేయాలంటూ అనేక మంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. జోవో 99పై స్టే విధించాలంటూ పట్టుబడుతున్నారు.