Feeding Milk: బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందా?తగ్గుతుందా?
బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా రొమ్ము క్యాన్సర్ వస్తుంది అన్నది కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:00 PM, Fri - 4 October 24

మామూలుగా స్త్రీలు పిల్లలకు జన్మనిచ్చిన తరువాత తప్పనిసరిగా పిల్లలకు పాలు ఇవ్వాలని అప్పుడే తల్లి ఆరోగ్యం అలాగే పుట్టిన బిడ్డ ఆరోగ్యం బాగుంటుందని చెబుతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది ఫ్యాషన్ పేరుతో మొహమాటం పేరుతో పిల్లలకు పాలు ఇవ్వడం మానేశారు. ఇంకొందరు పాలు నేరుగా ఇవ్వకుండా అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందడంతో పాటు వృక్షోజాలలో ఎన్నో మార్పులకు దారితీస్తుందట. అలాగే బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు. అయితే కొంతమంది పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని నమ్ముతూ ఉంటారు.
మరి నిజంగానే పిల్లలకు పాలు ఇస్తే రొమ్ము క్యాన్సర్ వస్తుందా ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే తల్లులు పిల్లలకు ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుంది అన్నది కేవలం అపోహ మాత్రమే అని పాలు ఇవ్వడం ద్వారా రొమ్ము క్యాన్సర్ తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. తల్లి పాలలో శిశువు రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ప్రతిరోధకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వారి గట్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. తల్లి పాలలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా హానికరమైన వ్యాధి కారకాల నుంచి రక్షించేటప్పుడు జీర్ణక్రియ, పోషకాల శోషణకు కూడా సహాయపడుతుంది. ఈ శరీరక ప్రయోజనాలతో పాటుగా తల్లి పాలివ్వడం వల్ల బిడ్డకు, తల్లికి బలమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుందట.
తల్లి పాలివ్వడం వల్ల సాన్నిహిత్యం పెరుగుతుందట. మీకు, మీ బిడ్డకు స్పర్శ అనుభందం పెరుగుతుంది. ఐ కాంటాక్ట్ కూడా పెరుగుతుందని ఇది బంధం, భావోద్వేగ భద్రతను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. అలాగే పాలిచ్చే సమయంలో హార్మోన్ల మార్పిడి తల్లి, బిడ్డ ఇద్దరిలో ఆక్సిటోసిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది మీ మధ్య ప్రేమ, నమ్మకం, అనుబంధం భావాలను పెంచుతుందట. చాలా మంది మహిళలు తల్లిచ్చే సమయంలో నిపుణుడి సహాయం తీసుకుంటారు. కానీ కొంతమంది మహిళలు తల్లి పాలివ్వడం చుట్టూ ఉన్న అపోహల కారణంగా పాలివ్వడానికి సంకోచిస్తారు.
కానీ అలాంటి వారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. పాలివ్వడం వల్ల మహిళల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే. నిజానికి తల్లిపాలివ్వడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని పలు అధ్యయనాలు వెళ్లడించాయి. తల్లి పాలివ్వడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని అనేక పరిశోధన అధ్యయనాలు కనుగొన్నాయి. ముఖ్యంగా వీళ్లు ఎక్కువ కాలం తల్లి పాలిస్తే అంటే 2 సంవత్సరాలు తల్లి పాలివ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం 1 శాతం తగ్గతుందని చెబుతున్నారు.