Chicago: చికాగోలో దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన హైదరాబాదీ
చికాగోలో దొంగలు దాడిలో హైదరాబాద్ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నలుగురు దొంగలు దాడి చేయడంతో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి గాయపడ్డాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
- Author : Praveen Aluthuru
Date : 06-02-2024 - 11:06 IST
Published By : Hashtagu Telugu Desk
Chicago: చికాగోలో దొంగలు దాడిలో హైదరాబాద్ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నలుగురు దొంగలు దాడి చేయడంతో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి గాయపడ్డాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇండియానా వెస్లియన్ యూనివర్శిటీ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చదువుతున్న సయ్యద్ మజాహిర్ అలీపై గత ఆదివారం ఉదయం క్యాంప్‌బెల్ అవెన్యూలో ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ఆ తర్వాత తన వద్ద ఉన్న వస్తువులు దోచుకున్నారు.
హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్ ప్రాంతంలో నివసిస్తున్న అలీ భార్య సయ్యదా రుక్వియా ఫాతిమా రజ్వీ స్పందిస్తూ.. తన భర్తకు మంచి వైద్యం అందేలా సహాయం చేయాలని మంగళవారం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కి విజ్ఞప్తి చేశారు. తన ముగ్గురు పిల్లలతో కలిసి అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రికి రాసిన లేఖలో ఆమె అభ్యర్థించారు. తన భర్త భద్రత గురించి తాను ఆందోళన చెందుతున్నానని ఆమె రాసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో రికార్డ్ అయింది. అలీ రోడ్డుపై నడుస్తుండగా ముగ్గురు వెంబడించి దాడికి పాల్పడ్డారు. గత నెల రోజులుగా అమెరికాలో నలుగురు భారతీయ సంతతి విద్యార్థులు శవమై కనిపించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read: Crime News: మాదాపూర్ లో 2 కోట్ల చిట్ ఫండ్ కుంభకోణం..నిందితులు అరెస్ట్