HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >High Court Issues Notices To Mla Danam Nagender

Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

  • Author : Vamsi Chowdary Korata Date : 23-03-2026 - 1:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Danam Nagender
Danam Nagender

Danam Nagender  బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ఈ నోటీసులపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. గతంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దానం నాగేందర్ పార్టీ మారలేదని ఇచ్చిన తీర్పును ఆయన తన పిటిషన్‌లో సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ‘బి-ఫామ్’‌పై పోటీ చేశారని, ఇది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తుందని మహేశ్వర్ రెడ్డి వాదించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ తీర్పును రద్దు చేసి, దానంపై అనర్హత వేటు వేయాలని కోర్టును అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ప్రతివాదులుగా ఉన్న దానం నాగేందర్‌తో పాటు అసెంబ్లీ స్పీకర్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా దానం నాగేందర్, స్పీకర్ తమ వివరణలను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aleti Maheshwar Reddy
  • Assembly Speaker
  • brs party
  • congress party
  • danam nagender
  • danam nagender congress
  • Disqualification Petition
  • Khairatabad MLA
  • MLA Danam Nagender
  • MLAs Disqualification Petition
  • Telangana High Court
  • telangana politics

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Delhi High Court deals a blow to Kavitha.

    kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

  • Mallareddy says goodbye to BRS

    Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

  • Delhi High Court deals a blow to Kavitha.

    TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

Latest News

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

  • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd