Drinking water: రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే ఏం జరుగుతుందో, ఇలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:30 PM, Thu - 20 February 25

నీరు శరీరానికి చాలా అవసరం. శరీరానికి సరిపడా నీళ్లు తాగినప్పుడే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే రోజూ తగినంత నీళ్లు తాగాలి. నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయట. ముఖ్యంగా నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగితే శరీరాన్ని త్వరగా రీ హైడ్రేట్ చేయవచ్చట. రోజంతా చురుకుగా ఉండవచ్చట. ఇంకా దీనివల్ల మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయట. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అయిపోతుందట.
వాటర్ శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుందట. మలబద్ధకాన్ని దూరం చేస్తుందట. మలబద్ధకం లేదా కడుపులో అసౌకర్యంగా ఉంటే, ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే రిలీఫ్ ఉంటుందని చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందట. ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల మెరిసే చర్మం లభిస్తుందట. దీనితో పాటు మొటిమలు, మొటిమల వల్ల ఏర్పడే మచ్చల సమస్య నుండి కూడా చాలా ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. ప్రతీ ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగితే, అది బరువు తగ్గడానికి సహాయపడుతుందట.
కొన్ని రోజుల్లోనే తేడా కనిపిస్తుందట. ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల మెదడుపై సానుకూల ప్రభావం ఉంటుందట. ఇది మీ జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుందట. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందట. ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడటమే కాకుండా మలబద్ధకం నుండి బయటపడటానికి కూడా సహాయపడుతుందట. ఆరోగ్యంగా ఉండాలంటే రోజు నాలుగు లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. నిద్ర మేల్కొన్న వెంటనే నీటిని తాగితే పేగు కదలికలు ఆరోగ్యంగా మారుతాయి. శరీరం డీ హైడ్రేషన్ కాకుండా ఉంటుందట. ఉదయాన్నే నీటిని తాగడం వల్ల వ్యాధి నిరోధకశక్తి కూడా పెరుగుతుందట.