HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Former Minister Ramreddy Damodar Reddy 73 Passes Away

Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత.. ఆయ‌న రాజ‌కీయ జీవిత‌మిదే!

మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి ఆయన స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి (శ‌నివారం) సూర్యాపేట జిల్లాలోని స్వగ్రామం తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి.

  • Author : Gopi Date : 02-10-2025 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ramreddy Damodar Reddy
Ramreddy Damodar Reddy

Ramreddy Damodar Reddy: సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (Ramreddy Damodar Reddy) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ (AIG) హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దామోదర్ రెడ్డి మృతితో సూర్యాపేట జిల్లాతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరణం పట్ల ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్తలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ప్రజాజీవితంలో ‘దామన్న’ ప్రస్థానం

రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. సూర్యాపేట రాజకీయాల్లో ‘దామన్న’గా ఆయన సుపరిచితులు. సుదీర్ఘ‌కాలం పాటు ప్రజాసేవలో ఉన్న ఆయన మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదట‌గా సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన.. తదనంతరం సూర్యాపేట నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Also Read: ‎Curd with Chia Seeds: పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించిన దామోదర్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ (సమాచార సాంకేతిక శాఖ) శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే తెలంగాణ వాణిని బలంగా వినిపించిన నాయకుల్లో ఒకరుగా ఉన్నారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు.

అంత్యక్రియలు ఎల్లుండి తుంగతుర్తిలో

మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి ఆయన స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి (శ‌నివారం) సూర్యాపేట జిల్లాలోని స్వగ్రామం తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. దామన్న మరణవార్త విని అభిమానులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తుంగతుర్తిలో పెద్ద ఎత్తున ఆయన అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన ఆకస్మిక మృతితో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Former minister
  • Ramreddy Damodar Reddy
  • Suryapeta
  • telangana
  • telugu news

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Ration Cards To Be Issued W

    Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • One Lakh New Pensions In Te

    New Pension : తెలంగాణలో పెన్షన్లకు భారీ ప్రక్షాళన .. కొత్తగా లక్ష పెన్షన్లు..!

  • Notification for the recruitment of Anganwadi teacher posts!

    Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd