Curd with Chia Seeds: పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Curd with Chia Seeds: పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 08:00 AM, Thu - 2 October 25

Curd with Chia Seeds: చియా సీడ్స్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసిన తర్వాత చాలామంది ఈ చియా సీడ్స్ ని అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ చియా సీడ్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాగా రెండు చెంచాల చియా సీడ్స్‌లో దాదాపు 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో పాటుగా ఎక్కువ కాలం పాటు కడుపు నిండుగా ఉంచడంలో హెల్ప్ చేస్తుందట.
కాగా పెరుగులో ప్రోటీన్ ఉంటుందట. ఇది కండరాలకు బలం అందిస్తుందని, శరీరానికి శక్తిని ఇచ్చి ఆకలిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. కాగా పెరుగులో కాల్షియం, పొటాషియం, బి విటమిన్లు ఉంటాయి. అయితే చియాసీడ్స్ లో ఒమేగా 3, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయట. కాబట్టి ఇవి రెండూ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. చియా సీడ్స్ లోని ఫైబర్ పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు ఆహారం అందిస్తుందట. పెరుగు కూడా నేరుగా మంచి బ్యాక్టీరియాను శరీరానికి చేరుస్తుందని, ఇవి రెండూ కలిసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.
అలాగే ఇవి కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తాయట. పెరుగుతో కలిపి చియా సీడ్స్ తీసుకుంటే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ శరీరానికి అందుతుందట. ఇవి జీర్ణక్రియను నెమ్మదించేలా చేసి రక్తంలోని చక్కెరను కంట్రోల్ చేస్తాయని, ఇది మధుమేహంతో ఇబ్బంది పడేవారికి మంచి ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు. పెరుగు, చియా తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుందట. ఇందులో ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ ఉంటాయని, ఇవి ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేస్తాయని, ఇది చక్కెర నెమ్మదిగా రక్తంలోకి వెళ్లడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే ఎక్కువ కాలం ఎనర్జీ ఉంటుందట. కాగా పెరుగు, చియా సీడ్స్ అల్పాహారంగా తీసుకుంటే మంచిదట. వీటిని ఓవర్‌నైట్ పుడ్డింగ్, స్మూతీ లేదా ఫ్రోజెన్ యోగర్ట్ పాప్స్ రూపంలో తీసుకోవచ్చని, పెరుగుతో కలిపి చియా తినడం వల్ల రుచి, పోషకాలు రెండూ పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..