HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Former Minister Harish Rao Strongly Criticizes Congress Government

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు

తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి కూడా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని హరీశ్ రావు అన్నారు.

  • Author : Gopi Date : 10-09-2025 - 3:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

Harish Rao: తెలంగాణలో నెలకొన్న యూరియా కొరత, వరదలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు బదులుగా ‘బురద రాజకీయాలకు’ ప్రాధాన్యత ఇచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు. ఆదివారం హడావుడిగా సభను నిర్వహించి, అసంపూర్తిగా ముగించడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమని అన్నారు.

రైతులకు పెనుశాపంగా మారిన పాలన

హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చర్చించే సమయం, సామర్థ్యం లేవని, ఈ దిక్కుమాలిన పాలన తెలంగాణ రైతాంగానికి పెనుశాపంగా మారిందని అన్నారు. భారత దేశ చరిత్రలో యూరియా కోసం రైతులు ఇంతగా తిప్పలు పడ్డ పరిస్థితులు ఎప్పుడూ లేవని, కాంగ్రెస్ చేతగాని పాలన వల్ల పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా కోసం రోడ్ల వెంట బారులు తీరాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆధార్ కార్డులు, పాస్‌బుక్కులు పట్టుకొని యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నారని, పండుగలు, పబ్బాలు లేకుండా, వానా, ఎండతో సంబంధం లేకుండా రాత్రి, పగలు క్యూలో నిలబడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలసి సొలసి పడిపోతున్నారని, ఓపిక లేక చెప్పులు, పాస్‌బుక్కులు, ఖాళీ సీసాలు, రాళ్లు పెట్టి రోజుల తరబడి ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు.

Also Read: Heavy Rains: 20 రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు!

పత్తి, వరికి యూరియా అత్యవసరం

పత్తి పూత దశలో, వరి పొట్ట దశలో ఉన్నాయని ఈ సమయంలో యూరియా వేయకపోతే దిగుబడి రావని రైతులు పడుతున్న ఆవేదన హృదయ విదారకంగా ఉందని హరీశ్ రావు అన్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ, యూరియా సంక్షోభంపై రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. హైవేలెక్కి ధర్నాలు చేస్తున్న రైతన్నల ఆగ్రహ జ్వాలలే దీనికి సాక్ష్యమని ఆయన అన్నారు. ఈ సంక్షోభం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల వచ్చిందని ఆయన ఆరోపించారు.

కేసీఆర్ పాలనతో పోలిక

కేసీఆర్ పాలనలో సకాలంలో యూరియా సరఫరా జరిగిందని, పాలకులు మారగానే పాలసీలు మారిపోతాయా అని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతుల కష్టాలు తీర్చని ప్రభుత్వం వల్ల ఏం లాభమని ఆయన నిలదీశారు. యూరియా సరఫరా విషయంలో కేంద్రం నుంచి తెప్పించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదని ఆయన విమర్శించారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులను మోసం చేసిందని ఆయన ఆరోపించారు.

బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల నిర్లక్ష్యం

తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి కూడా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని హరీశ్ రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించడం, అమెరికా పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడం వల్ల ఆయిల్ ఫామ్, పత్తి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ సమస్యలపై ఎంపీలకు ఉలుకు, పలుకు లేదని ఆయన దుయ్యబట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CM Revanth Reddy
  • Congress Government
  • harish rao
  • telangana
  • telugu news
  • Urea

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Ration Cards To Be Issued W

    Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • One Lakh New Pensions In Te

    New Pension : తెలంగాణలో పెన్షన్లకు భారీ ప్రక్షాళన .. కొత్తగా లక్ష పెన్షన్లు..!

  • Telangana's debt stands at a staggering Rs 8.21 lakh crore; Bhatti Vikramarka lashes out at BRS.

    Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd