KCR Entered Social Media: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్..!
ఇప్పటివరకు సోషల్ మీడియా అకౌంట్ వాడని కేసీఆర్ తాజాగా ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
- Author : Gopichand
Date : 27-04-2024 - 1:08 IST
Published By : Hashtagu Telugu Desk
KCR Entered Social Media: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ ఆవిర్భావం రోజు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియా అకౌంట్ వాడని కేసీఆర్ తాజాగా ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ (KCR Entered Social Media) ఇచ్చారు. గత పదేళ్లు సీఎంగా చేసిన సమయంలో సోషల్ మీడియా ఫ్లాట్‌పామ్‌కు దూరంగా ఉన్న కేసీఆర్ పార్టీ ఆవిర్భావం రోజే జనాదరణ పొందిన ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం సర్వత్రా ఆసక్తి నెలకొల్పింది. అయితే ఎక్స్ వేదికగా కేసీఆర్ తన ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో బిజీగా ఉన్న కేసీఆర్ ఆయన ప్రసంగాలు, ఆయన రాజకీయ కార్యక్రమాలు, రోడ్‌షోలు, యాత్రల వివరాలను ఇకపై ట్విట్టర్‌లో పంచుకోనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
అయితే ఈ సోషల్ మీడియాల ద్వారా మాజీ సీఎం కేసీఆర్ సంచలనాలను సృష్టించే అవకాశం ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు. ఎలాంటి విషయాలను పంచుకోబోతున్నారు..? అధికార పార్టీకి ఎక్స్, ఇన్‌స్టా ద్వారా ప్రశ్నలు సంధిస్తారా..? అసలు ఎలాంటి విషయాలకు ఇవి వేదిక కాబోతున్నాయనే ప్రశ్నలు అటు రాజకీయ విశ్లేషకులు, ఇటు పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Journalist Fire: సీఎం రేవంత్ భద్రతా సిబ్బందిపై లేడీ జర్నలిస్ట్ ఫైర్.. అసలేం జరిగిందంటే..?
ఈ వార్త రాసే సమయానికి కేసీఆర్‌ను 5400 మంది ఫాలో అవుతున్నారు. ఆయన కేవలం ముగ్గురిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో ఆయన కొడుకు కేటీఆర్, మనవడు హిమన్షు రావు, మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌ను మాత్రమే గులాబీ బాస్ ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, బహిరంగ సభల్లో తనదైన శైలిలో ఆకట్టుకున్న కేసీఆర్ ఇక సోషల్ మీడియాను ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో చూడాలి. అయితే కొందరు పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కేసీఆర్ రికార్డులను క్రియేట్ చేయటం ఖాయమని అంటున్నారు.
We’re now on WhatsApp : Click to Join