Fire Accident In Medak: మెదక్ లో విషాదం.. చిన్నారితో సహా వృద్ధురాలు సజీవ దహనం
మెదక్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారితో సహా, వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన చేగుంట మండలం చిన్న శివునూరులో జరిగింది. గత రాత్రి ప్రమాదవశాత్తు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిపడ్డాయి.
- Author : Gopichand
Date : 25-01-2023 - 8:50 IST
Published By : Hashtagu Telugu Desk
మెదక్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారితో సహా, వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన చేగుంట మండలం చిన్న శివునూరులో జరిగింది. మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిపడ్డాయి. మంటల్లో ఇద్దరు కాలిబూడిదయ్యారు. 60 సంవత్సరాల వృద్ధురాలితో పాటు ఆరేళ్ల చిన్నారి మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు.
Also Read: More than 50,000 Died: కెనడాలో 50 వేలు దాటిన కోవిడ్-19 మరణాలు
ఇటీవల మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ సెంటర్ లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్టాండ్ సెంటర్లో ఉన్న షాపుల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు 4 షాపులు పూర్తిగా దగ్దమయ్యాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. హుటాహుటిన చేరుకున్న పోలీనులు మంటలను అదుపు చేశారు.ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.