HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Etela Rajender About Phone Tapping Case

Etela Rajender : ఫోన్‌ ట్యాపింగ్‌లో మొదటి బాధితున్ని నేనే – ఈటెల

ఫోన్‌ ట్యాపింగ్‌లో మొదటి బాధితున్ని తానేనని.. తమ కుటుంబ సభ్యులందరి ఫోన్లు ట్యాప్ చేశారని, కొన్ని సంసారాలు కూడా ఫోన్ ట్యాపింగులతో పాడయ్యాయని

  • Author : Sudheer Date : 07-04-2024 - 5:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Etela Rajender Phone Tappin
Etela Rajender Phone Tappin

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం ఫై మాజీ మంత్రి , మల్కాజ్ గిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ (Etela Rajender) కీలక వ్యాఖ్యలు చేసారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో మొదటి బాధితున్ని తానేనని.. తమ కుటుంబ సభ్యులందరి ఫోన్లు ట్యాప్ చేశారని, కొన్ని సంసారాలు కూడా ఫోన్ ట్యాపింగులతో పాడయ్యాయని, ఈ ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేసారు. ఆదివారం అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మాజీ సీఎం కేసీఆర్‌లానే తాజా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని ఈటెల విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు నెరవేర్చలేదని, కేసీఆర్ హయాంలో ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ ఇప్పటికీ రాలేదని ధ్వజమెత్తారు. మహాలక్ష్మీ పేరిట నగదు సాయం అమలు కావడం లేదన్న ఈటల, రైతు భరోసా, కౌలు రైతులకు సాయం రైతులకు బోనస్‌ ఇస్తామన్నారు కానీ, ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. కడియం శ్రీహరిని దళితుడు కాదన్న రేవంత్ రెడ్డి, మళ్లీ అతని కుమార్తెకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన మల్కాజిగిరిలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేదన్నారు.

రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారు వెంటనే అనర్హులవుతారని చెప్పిన కాంగ్రెస్‌, ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా తీసుకుందని , కేంద్రంలో అధికారంలోకి రాలేని కాంగ్రెస్‌, హామీలు ఎలా అమలు చేస్తుందని ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను వంచించడానికే గ్యారెంటీలు ప్రకటించిందని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్నికల్లో బీజేపీదే విజయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు.

Read Also : MI vs DC: రోహిత్ హాఫ్ సెంచరీ మిస్.. నిరాశపరిచిన సూర్య


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • elections 2024
  • etela rajender
  • Lok Sabha Elections
  • Phone tapping

Related News

CM Revanth Reddy

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్‌ విభజన

GHMC తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని మూడు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు తాజాగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహ

    Latest News

    • Richest Village : ప్రపంచంలోనే ధనిక గ్రామం ఏ రాష్ట్రంలో ఉందొ తెలుసా ?

    • కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

    • CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

    • I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

    • వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

    Trending News

      • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

      • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

      • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

      • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd