HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Efforts On To Bring Golf City To Hyderabads Southern Region

Golf City: మంత్రి శ్రీధ‌ర్ బాబు గుడ్ న్యూస్‌.. మ‌రో 10 వేల మందికి ఉపాధి!

తెలంగాణ ప్రభుత్వం తమకు సహకరిస్తే గోల్ఫ్ కోర్టులు, నివాస సముదాయాలు, హోటళ్లు, వినోద పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి పిజిఏ, స్టోన్ క్రాఫ్ట్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని శ్రీధర్ బాబు వెల్లడించారు.

  • Author : Gopi Date : 20-10-2024 - 12:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Golf City
Golf City

Golf City: గోల్ఫ్‌ సిటీ (Golf City) నిర్మాణంలో పదేళ్లలో 10 వేల మందికి ఉపాధి కల్పిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబుతో ప్రొఫెసర్‌ గోల్ఫర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అమెరికా(పీజీఏ), స్టోన్‌ క్రాఫ్ట్స్‌ ప్రతినిధుల సమావేశం అయ్యారు. కన్సార్టియం ఫోర్త్‌ సిటీలో గోల్ఫ్‌ సిటీ ఏర్పాటుకు పీజీఏ ముందుకొచ్చింది. స్టోన్‌ క్రాఫ్ట్‌తో కలిసి గోల్ఫ్‌ సిటీ నిర్మాణానికి పీజీఏ సంసిద్ధత వ్యక్తం చేసింది.

ఫ్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(పిజిఏ), స్థానిక భాగస్వామి స్టోన్ క్రాఫ్ట్ తో కలిసి సిటీ దక్షిణాన విస్తారమైన గోల్ఫ్ సిటీని నిర్మించేందుకు ముందుకు వచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. అమెరికా టెక్సస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో ప్రధాన కేంద్రంగా ఉన్న పిజిఏ ప్రతినిధి బృందం శనివారం ఆయనతో సెక్రటేరియట్ లో భేటీ అయింది.

Also Read: HYDRA: హైద‌రాబాద్‌పై హైడ్రా స్పెష‌ల్ ఫోక‌స్‌.. ప్లాన్ ఏంటంటే..?

తెలంగాణ ప్రభుత్వం తమకు సహకరిస్తే గోల్ఫ్ కోర్టులు, నివాస సముదాయాలు, హోటళ్లు, వినోద పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి పిజిఏ, స్టోన్ క్రాఫ్ట్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని శ్రీధర్ బాబు వెల్లడించారు. పిజిఏ ప్రస్తుతం ముంబయిలో షాపూర్జీ పల్లోంజి సంస్థతో కలిసి గోల్ఫ్ సిటీ నిర్మాణం చేపడుతోందని ఆయన తెలిపారు. ఇక్కడ స్టోన్ క్రాఫ్ట్ భాగస్వామ్యంతో భారీ పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిందని వివరించారు. గోల్ఫ్ సిటీ నిర్మాణం పూర్తయితే వచ్చే పదేళ్లలో పదివేల మందికి ఉపాధి దొరుకుతుందని శ్రీధర్ బాబు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక ఫోర్త్ సిటీలో ఎటువంటి కాలుష్యం వెలువడని నెట్-జీరో సిటీని నిర్మిస్తుందని పేర్కొన్నారు.

నిర్మాణాలకు మూడింతలు ప్రకృతి వనాలను పెంచడం ద్వారా ఆహ్లాదకర నివాస ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సంస్థలు తమ ప్రెజెంటేషన్ లో వెల్లడించినట్టు శ్రీధర్ బాబు చెప్పారు. పిజిఏ కన్సార్టియం దాదాపు 200 ఎకరాల్లో ‘18 హోల్’ ప్రామాణిక గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేస్తుంది. ఇది వినియోగంలోకి వస్తే దక్షిణ భారత దేశంలోనే మొట్ట మొదటిది అవుతుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. మియావాకి పద్ధతిలో అడవిని పెంచడం ద్వారా సహజ సిద్ధమైన డెక్కన్ శిలలకు, స్థానిక నీటి వనరులకు ఒక అలంకార ప్రాయమవుతుందని వివరించారు. పిజిఏ ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా సంస్థలలో ఒకటి. 30,000 మందికి పైగా గోల్ఫ్ నిపుణులతో కూడిన ఈ సంస్థ గోల్ఫ్ అభివృద్ధికి వందేళ్లుగా కృషి చేస్తోంది. పిజిఏ పలు చాంపియన్‌షిప్‌లు, రైడర్ కప్ వంటి టోర్నీలను నిర్వహిస్తోంది. భేటీలో స్టోన్ క్రాఫ్ట్ సిఇఓ కీర్తి చిలుకూరి, అలోక్ తివారి, పిజిఏ ప్రతినిధులు టిమ్ లాబ్, అలెక్స్ హే, డేవిడ్ బ్లమ్, కెన్ సాగర్, రాధా కిషోర్, తదితరులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • congress
  • D Sridhar Babu
  • Frisco
  • Golf City
  • hyderabad
  • Minister Sridhar Babu
  • telangana

Related News

siddaramaiah-and-dk-shivakumar

Karnataka : వీడ్కోలు సమావేశంలో భావోద్వేగ క్షణాలు.. డీకేకు ఆశీర్వాదం ఇచ్చిన సిద్దరామయ్య

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికారిక నివాసం ‘కావేరి’లో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. సమావేశానికి హాజరైన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిని ఆత్మీయంగా ఆలింగనం చేసు

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

  • Ntr Statue Ammerpet

    NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

  • Ntrs Birth Anniversary Junior Ntr Kalyan Ram Ntr Ghat Hyderabad Ntr

    NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

  • Hawala Cash

    Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హ‌వాలా డ‌బ్బుగా పోలీసుల అనుమానాం

Latest News

  • Mahanadu : ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం

  • IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd