HYDRA: హైదరాబాద్‌పై హైడ్రా స్పెషల్ ఫోకస్.. ప్లాన్ ఏంటంటే..?
హైడ్రా, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలను ఇరువురు అధికారులు సమీక్షించారు. లక్డీకపూల్, రాజ్ భవన్ ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ పాయింట్లను తనిఖీ చేసి వరద ముప్పు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
- Author : Gopichand
Date : 20-10-2024 - 12:15 IST
Published By : Hashtagu Telugu Desk
HYDRA: హైదరాబాద్‌పై హైడ్రా (HYDRA) స్పెషల్ ఫోకస్ పెట్టింది. వరద ముంపు.. ట్రాఫిక్ చిక్కులను తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు, GHMC అధికారులతో కలిసి హైడ్రా ఈ డ్రైవ్ చేపట్టింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, నగర ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ పి. విశ్వప్రసాద్ లు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వరద నీరు నిలుస్తున్న ప్రాంతాలతో పాటు ట్రాఫిక్ స్తంభిస్తున్న ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో శనివారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, నగర ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ పి. విశ్వప్రసాద్ పర్యటించి పరిశీలించారు.
హైడ్రా, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలను ఇరువురు అధికారులు సమీక్షించారు. లక్డీకపూల్, రాజ్ భవన్ ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ పాయింట్లను తనిఖీ చేసి వరద ముప్పు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. లక్డీకపూల్, పరిసర ప్రాంతాల్లో గతంలో ఉండే వరద నీటి కాలువ శిథిలమైన తీరును గమనించి పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను హైడ్రా కమిషనర్ సూచించారు.
Also Read: India A Beat Pakistan A: ఎమర్జింగ్ ఆసియా కప్.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
ద్వారక హోటల్ ముందు నుంచి లక్కీ రెస్టారెంట్ మీదుగా భూగర్భ కాలువ ద్వారా గతంలో వరద నీరు సాఫీగా ప్రవహించేదని.. ఈ కాలువ ఎక్కడికక్కడ శిథిలమై, పూడుకుపోవడంతో సమస్య తలెత్తుతోందని జీహెచ్ఎంసీ సర్కిల్ 17 ఈఈ వెంకట నారాయణ తెలిపారు. గతంలో ఈ వరదంతా లక్డీకపూల్ రైల్వే వంతెన కిందకు సాఫీగా సాగేదని.. ఇప్పుడు మళ్లీ ఆ కాలువను పునరుద్ధరించాలంటూ అధికారులకు ఆయన ఆదేశాలు జారీచేశారు. లక్డీకపూర్ చౌరస్తాలో వరదనీటి కాలువ ప్రవహించే తీరును ఆశాంతం పరిశీలించి, రైల్వే వంతెన కిందకు వరద నీరు ప్రవహించకుండా ఉన్న అడ్డంకులను రైల్వే ట్రాక్ మార్గంలో నడిచి పరిశీలించారు.
వారం రోజులలో వరద కాలువలను పునరుద్ధరించాలని.. అప్పటికీ వరద ముప్పు తప్పని పరిస్థితుల్లో ఈ వర్షాకాలానికి తాత్కాలిక చర్యలు చేపట్టి.. వచ్చే వేసవిలో కాలువను విస్తరించాలని నిర్ణయించారు. అక్కడికక్కడే జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో మాట్లాడి హైడ్రా డీఆర్ ఎఫ్ బృందంతో కలిసి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను రంగనాథ్ చర్చించారు.