HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Eamcet Name Change

EAMCET : ఎంసెట్ పేరు మార్చిన తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి

  • Author : Sudheer Date : 25-01-2024 - 7:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Eamcet Name Change
Eamcet Name Change

తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఎంసెట్‌(EAMCET) పేరును మార్చింది ఉన్న‌త విద్యామండ‌లి. టీఎస్‌ ఎంసెట్‌ పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌(TS EAPCET)గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ సహా పలు ప్రవేశ పరీక్షలకు తేదీలను విడుదల చేస్తూ నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. మే 9 -13 వరకూ eapset పరీక్షలు జరగనున్నాయి.

మే 9 నుంచి 11వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సుల‌కు ప్ర‌వేశ ప‌రీక్ష‌ నిర్వహించున్నారు. మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ ప్రవేశ పరీక్ష జరగనుంది. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో టీఎస్ ఎంసెట్ నిర్వ‌హించ‌నున్నారు. ఇక టీఎస్ ఈసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నుంది. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌ను మే 6వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఈడీ కోర్సులో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష మే 23న జ‌ర‌గ‌నుంది. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వ‌హించ‌నుంది. 3 ఏండ్ల‌ న్యాయవిద్య, 5 ఏండ్ల‌ లా కోర్సులో ప్రవేశానికై నిర్వహించే టీఎస్ లా సెట్ ఎంట్రన్స్ టెస్ట్.. జూన్ 3వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు. అదే రోజు… ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ టెస్టును కూడా నిర్వ‌హించ‌నున్నారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌ల‌ను ఉస్మానియా యూనివ‌ర్సిటీ నిర్వ‌హించ‌నుంది.

ఇక ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వ‌హించే టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్ష.. జూన్ 4, 5వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. కాకతీయ యూనివర్సిటీ నిర్వహణలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టు జర‌గ‌నుంది. ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ పీజీఈసెట్ పరీక్ష… జూన్ 6 నుంచి 8 తేదీల మ‌ధ్య‌లో నిర్వ‌హించ‌నున్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టులు జ‌ర‌గ‌నున్నాయి. బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే టీఎస్ పీఈసెట్ ప‌రీక్ష జూన్ 10 నుంచి 13వ తేదీల మ‌ధ్య‌లో నిర్వ‌హించ‌నున్నారు.

Read Also : CM Revanth Reddy : తెలంగాణ లో మరో స్కీమ్ అమలుకు ప్రభుత్వం సిద్ధం..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • EAMCET Name Change
  • telangana
  • TS EAPCET

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd