Telangana: రాష్ట్రంలో వరదల పరిస్థితికి బీఆర్ఎస్ కారణం: CPI(M)
తెలంగాణాలో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. పలు జిల్లాలో అధిక వర్షపాతం నమోదవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్థినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా వాటిల్లింది.
- By Praveen Aluthuru Published Date - 10:08 PM, Thu - 3 August 23

Telangana: తెలంగాణాలో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. పలు జిల్లాలో అధిక వర్షపాతం నమోదవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్థినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా వాటిల్లింది. ప్రభుత్వాలు అలర్ట్ అయినప్పటికీ కొన్ని ఏరియాలలో ఆ సహాయం అందలేదు. దీంతో అధికార బీఆర్ఎస్ పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో వరదల పరిస్థితికి అధికార బీఆర్‌ఎస్ ప్రభుత్వం కారణమని, బాధితులకు రూ.10 లక్షల పరిహారం, పునరావాసం కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ(CPI(M) డిమాండ్ చేసింది. వరదల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అవసరమైన అన్ని నష్టపరిహారం తీసుకోవాలని పార్టీ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
తెలంగాణ(Telangana)లో వరదల కారణంగా సంభవించిన విధ్వంసానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రియల్ ఎస్టేట్ దోపిడికి గురైందని ఆరోపించారు. ప్రతి వ్యవసాయ క్షేత్రానికి, ఇంటింటికి నీరు తీసుకురావాలనే పేరుతో కేసీఆర్ భారీ డ్యాంల ప్రాజెక్టులను నిర్మించారు. కానీ ఆఖరికి ఈ మెగా డ్యాం ప్రాజెక్టులు తెలంగాణ రైతాంగానికి నీరు అందించడంలో గానీ, ఇంటింటికి నీరు అందించడంలో గానీ నిరుపయోగంగా మారాయి. ఓపెన్ కాస్ట్ గనులు, ఇతర ప్రాజెక్టుల వల్ల పర్యావరణం నాశనమవుతోందని, వాటిని అరికట్టాలని సీపీఐ(ఎం) పేర్కొంది.
వరదల వల్ల తెలంగాణ ప్రజలు పడుతున్న అమానవీయ బాధలకు బి.జె.పి (BJP) కూడా బాధ్యత వహించాలని ప్రకటనలో తెలిపారు. ఇలాంటి కష్టకాలంలో మావోయిస్టు పార్టీ ప్రజలకు అండగా నిలుస్తోంది. ఒక శాతం సమాజానికి మేలు చేసే ఇలాంటి నాయకులని పారద్రోలకపోతే, మన భవిష్యత్ తరాలకు మనం అన్యాయం చేసినట్టే. చరిత్ర నుంచి నేర్చుకుందాం, కొత్త చరిత్రను రాద్దాం’ అని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: Chikoti Praveen: బీజేపీలోకి చికోటి?.. ఢిల్లీలో రాజకీయాలు