HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cpim Leader Sitaram Yechury Considered Rahul Gandhis Mentor Cm Revanth Reddy

Sitaram Yechury : సీతారాం ఏచూరిని రాహుల్ గాంధీ మార్గనిర్దేశకుడిగా భావించేవారు : సీఎం రేవంత్

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సమకాలికుడు సీతారాం ఏచూరి(Sitaram Yechury) అని గుర్తు చేశారు.

  • Author : Pasha Date : 21-09-2024 - 2:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sitaram Yechury Cm Revanth Reddy

Sitaram Yechury : సీపీఎం  అగ్రనేత సీతారాం ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అరుదు అని, ఆయన్ను రాహుల్ గాంధీ మార్గనిర్దేశకుడిగా భావించే వారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ  రవీంద్ర భారతిలో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు.  దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సమకాలికుడు సీతారాం ఏచూరి(Sitaram Yechury) అని గుర్తు చేశారు. సీతారాం ఏచూరిని కలిసి మాట్లాడినప్పుడల్లా జైపాల్ రెడ్డి తనకు గుర్తుకొచ్చే వారని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు సీతారాం ఏచూరి పోరాడిన తీరు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ‘‘సీతారాం ఏచూరి బతికి ఉన్నంత కాలం పేదల కోసం పోరాడారు. మరణాంతరం కూడా ఆయన భౌతిక కాయం అందరికీ ఉపయోగపడాలన్న కుటుంబసభ్యుల నిర్ణయం ఎంతో గొప్పది’’ అని సీఎం రేవంత్ తెలిపారు. యూపీఏ హయాంలో పేదలకు ఉపయోగపడే కీలక బిల్లులకు మద్దతు తెలపడంలో సీతారాం ఏచూరి క్రియాశీల పాత్ర పోషించారని చెప్పారు.

Also Read :Sitaram Yechury : ఇందిరాగాంధీని రాజీనామా చేయమన్న ధీశాలి సీతారాం ఏచూరి :కేటీఆర్

‘‘జమిలి ఎన్నికల ముసుగులో దేశ రాజకీయాల్లో ఆధిపత్యం చలాయించాలన్న కుట్రకు బీజేపీ తెరతీసింది. ఇలాంటి కీలక సమయంలో సీతారాం ఏచూరి లాంటి నేత లేకపోవడం దేశ రాజకీయాలకు తీరని లోటు. రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన ఇలాంటి సందర్భంలో ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. మనకు దిక్సూచీలా ఉండాల్సిన సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం’’ అని సీఎం రేవంత్ తెలిపారు. సీతారాం ఏచూరి స్పూర్తితో జమిలి ఎన్నికల వ్యతిరేక పోరాటంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే ప్రధాని స్పందించకపోవడం బీజేపీ ఫాసిస్టు విధానాలకు నిదర్శనమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇష్టానుసారంగా భాషను ప్రయోగించే వారిని నియంత్రించకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

Also Read :President Droupadi Murmu : 28న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము..  రాష్ట్రపతి నిలయంలో కళా మహోత్సవాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • congress
  • CPI(M)
  • rahul gandhi
  • Sitaram Yechury

Related News

Jangaon Thorrur Congress

లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Congress  తెలంగాణ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేటు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మెుత్తం 11 మున్సిపాలిటీల్లో నేటిక ఎన్నిక వాయిదా పడగా.. వాటిల్లో అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. జనగామ, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అదృష్టం వరించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావటంతో లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లను ఎం

  • Bigshock

    TG Municipal Elections Results : కవితకు బిగ్ షాక్ ఇచ్చి..కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి స్వతంత్రులు

  • Congress Hava

    Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

  • Municipal Polling Counting

    Municipal Polling Counting : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుందంటే !!

Latest News

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd