HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Conspiracies Should Be Countered By Telangana Farmers Ktr

KTR: కాంగ్రెస్ కుట్రలను తెలంగాణ రైతాంగం తిప్పికొట్టాలి: కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ రైతుల్ని చంపుకుతినే రాబందని మరోసారి తేలిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

  • Author : Balu J Date : 11-07-2023 - 3:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KT Rama Rao
Telangana Minister KTR America Tour

కాంగ్రెస్ పార్టీ రైతుల్ని చంపుకుతినే రాబందని మరోసారి తేలిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు.  వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని కాంగ్రెస్ చేసిన ప్రకటన ఆ పార్టీ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. 24 గంటల కరెంట్ రద్దు చేసి…3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ దుష్ట విధానాలకు  పరాకాష్ఠ అన్నారు. తెలంగాణ రైతుకు ఉచిత విద్యుత్ ఊపిరిలాంటిదని, రైతుల ఊపిరిని ఆపేస్తామని, అన్నదాత ఉసురు తీస్తామని చెప్పడం కాంగ్రెస్ రాక్షస బుద్ధికి తార్కాణమన్నారు. నిన్నటిదాకా ధరణి రద్దు.. రైతుబంధు వద్దూ అంటూ ఇప్పటికే రైతు వ్యతిరేక విధానాలను ప్రకటిస్తున్న కాంగ్రెస్, ఇప్పుడు ఏకంగా ఫ్రీ కరెంట్ ను ఎత్తేస్తామన్న తన  క్రూరమైన ఆలోచనను బయటపెట్టుకుందన్నారు.  ఉచిత విద్యుత్ కు ఉరి వేసేందుకు గాంధీ భవన్ కేంద్రంగా జరుగుతున్న కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని.. తెలంగాణ రైతాంగానికి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ కాలంలో తెలంగాణ రైతులు పడ్డ కష్టాలు..అనుభవించిన బాధలను తెలంగాణ ఎన్నటి మర్చిపోదన్నారు. కాంగ్రెస్ కాలంలో కరువులు.. కన్నీళ్లు.. కటిక చీకట్లు.. అప్పులు.. ఆత్మహత్యలతో  అన్నదాతలు అరిగోస పడ్డారన్నారు.. కరెంట్ రాకడ.. ప్రాణం పోకడ తెలియదన్నట్టుగా ఆనాడు విద్యుత్ కోతలతో… చాలీ చాలని 3 గంటల నాసిరకం కరెంట్ తో రైతులు నరకం అనుభవించారన్నారు. కాలిపోయే మోటర్లు.. పేలిపోయే ట్రాన్సఫార్మర్లతో ఎండిన పంటలు.. రైతుల ధర్నాలు.. సబ్ స్టేషన్లుపై దాడులతో పరిస్థితులు దారుణంగా వుండేవని, అలాంటి దుర్భరమైన పరిస్ధితులు గత 9 ఎళ్లుగా మారిపోయాన్నారు.

అర్ధరాత్రి అపరాత్రి దొంగరాత్రి మోటర్లు పెట్టడానికి పోయి పాములు కుట్టి..కరెంట్ షాకులు కొట్టి మృత్యువాత పడ్డ రైతులు కాంగ్రెస్ పాలన పరిస్ధితులను తలుచుకునేందుకు కూడా సిద్దంగా లేరన్నారు.  ఒక్క కరెంటే కాదు… నాడు కాంగ్రెస్ హయాంలో ఎరువుల్ని పోలీస్‌ స్టేషన్లలో పెట్టి అమ్మే దుస్థితి ఉండేదని,  కిలోమీటర్లు దూరం క్యూలైన్లలో చెప్పులు.. లాఠీచార్జీల దృశ్యాలే కాంగ్రెస్ పాలనా పాడుకాలంలో ఉండేవన్నారు. కాంగ్రెస్ కల్తీ పాలనలో రైతులకు దొరికింది కల్తీ విత్తనాలు..కల్తీ పురుగు మందులే అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  రైతాంగాన్ని రక్షించుకోవడానికి ..వ్యవసాయాన్ని సంక్షోభంనుంచి బయటపడేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందన్న కెటిఅర్, ఇక్కడ సాగురంగానికి కరెంట్ ప్రాణావసరం అని గుర్తించి.. విద్యుత్ రంగంపై వేల కోట్లు వెచ్చించి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందించిందని తెలిపారు. కాళేశ్వరం.. మిషన్ కాకతీయ.. ఇతర ప్రాజెక్టుల వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి 27లక్షల బోరుబావుల కింద అన్నదాతలు రెండు పంటలు  పండించుకొని సంతోషంగా వున్నారని,  రైతుపచ్చగా వుంటే చూసి కళ్లుమండిన కాంగ్రెస్ శక్తులు నిరంతరం ఏవో కుట్రలు చేస్తూనే ఉన్నాయన్నారు. కేంద్రంలోని బీజేపి సర్కారు.. ఉచిత విద్యుత్ ను ఎత్తివేసి మోటర్లుకు మీటర్లు పెట్టాలని రాష్ట్రం మెడపైన కత్తిపెట్టినా ప్రభుత్వం లొంగిపోలేదన్న కెటిఅర్, 24 గంటల ఉచిత కరెంట్ ను కాపాడుకోవడం కోసం ఏకంగా 30వేల కోట్ల రూపాయలను వదులుకున్నది తప్ప రైతుల ప్రయోజనాలపై రాజీపడబోమన్నారు.

దేశానికే అన్నంపెట్టే స్థితికి ఎదిగిన తెలంగాణ అన్నదాతను చూసి కాంగ్రెస్ పార్టీకి కళ్లు మండుతున్నాయని మండిపడ్డారు.  రైతులు బాగుపడటం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు పచ్చివిషం గక్కుతున్నాయని,  భూమి చుట్టూ వున్న చిక్కుల్ని తొలిగించి.. పక్కా రక్షణనిచ్చిన ధరణి పోర్టల్ ను రద్దుచేస్తామంటున్న కాంగ్రెస్.. మళ్లీ నాటి బ్రోకర్లు.. దళారుల భూదందాల కాలాన్ని తీసుకొస్తామని నిస్సిగ్గుగా ప్రకటించిందని దుయ్యబట్టారు.  అదీ చాలక..24 గంటల ఉచిత విద్యుత్  అవసరమే లేదని.. మళ్లీ నాటి కాంగ్రెస్ చీకటి కాలాన్ని తిరిగితెస్తామని సిగ్గులేకుండా  చెబుతున్నదనీ అన్నారు.

ఈ 24 గంటల వెలుగుల్ని వదులుకుందామా..? కటిక కాంగ్రెస్ చీకట్ల కాలాన్ని మళ్లీ తెచ్చుకుందామా..? చైతన్యవంతమైన తెలంగాణ  రైతులు ఆలోచించుకోవాలన్నారు. ఉచిత విద్యుత్ వద్దన్నవాడిని ఊరిపొలిమేర్లకు రాకుండా ఉరికించాలని,  మూడు గంటల కరెంట్ చాలు అన్నవాడి మాడు పగిలేలా జవాబు చెప్పాలన్నారు. రైతులను పొడుచుకుతింటానికి కాచుకు కూర్చున్న కాంగ్రెస్ రాబందుల్ని తరిమికొట్టి.. రైతుబంధువులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు కేటిఅర్.

Also Read: Rashmika Mandanna: ముంబై ఎయిర్ పోర్ట్ లో రష్మిక క్రేజ్.. వీడియో వైరల్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hard comments
  • hyderabad
  • ktr
  • TCongress

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • HYDRAA

    HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

Latest News

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd