Hyderabad: వేములవాడ ఆలయ అర్చకుల ఆశీస్సులు అందుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
వేములవాడ ఆలయ అభివృద్ధి నిధుల మంజూరుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు, అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిసి ఆశీస్సులు అందజేశారు
- By Praveen Aluthuru Published Date - 02:45 PM, Fri - 30 August 24

Hyderabad: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 50 కోట్లు కేటాయించారు. దీన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆశీస్సులు అందజేశారు.
ఆలయ అభివృద్ధికి నిధుల మంజూరుకు కృతజ్ఞతలు తెలిపేందుకు విప్ ఆది శ్రీనివాస్‌తోపాటు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు, అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
సీఎంను కలిసిన బృందం రాజన్న ఆలయ విస్తరణ ప్రణాళికలపై చర్చించింది, ప్రతిపాదిత నమూనా మరియు ప్రణాళికలకు శృంగేరి పీఠం నుండి ఆమోదం అవసరమని అభిప్రాయానికి వచ్చారు. తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరమైన అనుమతులు తీసుకుని సంబంధిత అభివృద్ధి పనులను జాప్యం లేకుండా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రిని కలిసిన బృందంలో వేములవాడ రాజన్న ఆలయ ఈఓ వినోద్, ఆర్కిటెక్ట్ వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకుడు ఉమేష్ శర్మ, ఇతర ప్రముఖులు ఉన్నారు.
Also Read: God Idols: దేవుడి విగ్రహాలను బహుమతిగా ఇవ్వవచ్చా ఇవ్వకూడదా?