Revanth Reddy : గీత కార్మికులకు “కాటమయ్య” రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సీఎం
తెలంగాణ అభివృద్ధిలో గౌడన్నల పాత్ర చాలా కీలకమైదని ఆయన అన్నారు. గౌడన్నలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఈత, తాటి చెట్లను పెంచాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గీతా కార్మికులను కోరారు.
- By Latha Suma Published Date - 03:14 PM, Sun - 14 July 24

CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గీత కార్మికులకు “కాటమయ్య రక్ష కిట్ల” పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో ఆధునికి టెక్నాలజీతో తయారు చేసిన సేఫ్టీ కిట్లను(కాటమయ్య రక్ష కిట్లు) లబ్దిదారులకు అందజేశారు. అనంతరం గీతా కార్మికులతో సహపంక్తి భోజనం చేసారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో గౌడన్నల పాత్ర చాలా కీలకమైదని ఆయన అన్నారు. గౌడన్నలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఈత, తాటి చెట్లను పెంచాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గీతా కార్మికులను కోరారు. మిషన్ కాకతీయ పేరు మీద చెరువులను పూడిక తీసిన వద్ద చెట్లను పెంచాలని సూచించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎక్కడ చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు, కాలువల గట్ల వద్ద తాటి, ఈత చెట్లను పెంచేవిధంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక తీసుకుంటుందని తెలిపారు. సేప్టీ మోకుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాల నుంచి రక్షణకు కాటమయ్య రక్షణ కవచం ఉపయోగపడుతుందన్నారు. కులవృత్తులను కాపాడుదాం. గౌడన్నలు పౌరుషానికి ప్రతీక అన్నారు. గౌడన్నలకు ఉపాధి అవకాశాలను పెంచుతామని హామి ఇచ్చారు. బలహీన వర్గాల వారు పాలకులుగా మారాలంటే చదువే ఆయుధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read Also: Ratna Bhandagar : తెరుచుకున్న జగన్నాథుడి ‘రత్న భాండాగారం’.. ఖజానా లెక్కింపు షురూ
కాగా, లష్కర్‌గూడ తాటివనంలో సీఎం రేవంత్ రెడ్డి ఈత మొక్క నాటారు. గీత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాటి వనాల పెంపును ప్రొత్సహించాలని కోరారు. ఇందు కోసం గ్రామంలో 5 ఎకరాలు కేటాయించాలన్నారు. తాటి వనాలకు వెళ్లేందుకు మో పెడ్లు ఇవ్వాలని విజ్జప్తి చేశారు. రియల్ ఎస్టేల్ పెడగడం వల్ల తాటి వనాలు తగ్గుతున్నాయని సిఎం అన్నారు. అనంతరం తాటివనంలో కాటమయ్య సేఫ్టీ కిట్స్ పనితీరును సీఎం పరిశీలించారు. తాటి చెట్టు ఎక్కి సేఫ్టీ కిట్స్ పనితీరును గౌడన్నలు వివరించారు. కిట్స్ పని తీరును గౌడన్నలను అడిగి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. తాటి వనంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాటమయ్య రక్షణ కవచంతో గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కారు. లైవ్ లో రంగయ్య అనే గీత కార్మికుడితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రిస్క్ చేయొద్దు బాగుంటే బాగుందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి అని తెలిపారు. రక్షణ కవచంతో వల్ల సేఫ్ గా ఉన్నామని రంగయ్య అనే గీత కార్మికుడు సీఎంతో చెప్పాడు. ఎల్లో టీషర్ట్ వేసుకున్న గీత కార్మికుడిని టీ షర్ట్ భాగుందని సీఎం రేవంత్ రెడ్డి కితాబు ఇచ్చారు.
Read Also: Avoid Traffic Challan : గూగుల్ మ్యాప్స్‌లోని ఈ ఫీచర్లు వాడితే.. ట్రాఫిక్ ఛలాన్ల బెడదకు చెక్