Avoid Traffic Challan : గూగుల్ మ్యాప్స్‌లోని ఈ ఫీచర్లు వాడితే.. ట్రాఫిక్ ఛలాన్ల బెడదకు చెక్
ట్రాఫిక్ ఛలాన్లు తప్పించుకోవాలని భావించే వాహనదారులు గూగుల్ మ్యాప్స్‌ను వాడుకోవచ్చు.
- By Pasha Published Date - 01:58 PM, Sun - 14 July 24

Avoid Traffic Challan : ట్రాఫిక్ ఛలాన్లు తప్పించుకోవాలని భావించే వాహనదారులు గూగుల్ మ్యాప్స్‌ను వాడుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ సాయంతో ట్రాఫిక్ ఛలాన్లను ఎలా తప్పించుకోవచ్చు.. అని ఆలోచిస్తున్నారా ? దీనికి సమాధానం దొరకాలంటే ఈ కథనం చదవాల్సిందే..
We’re now on WhatsApp. Click to Join
మన వాహనం స్పీడ్ లిమిట్ దాటినా ట్రాఫిక్ ఛలాన్ జారీ అవుతుంది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనం అతివేగంగా నడపకూడదు. ఒకవేళ నడిపినా మనల్ని అలర్ట్ చేయడానికి గూగుల్ మ్యాప్స్‌లో స్పీడోమీటర్, స్పీడ్ లిమిట్స్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు రియల్-టైమ్‌లో స్పీడ్‌లిమిట్ సమాచారాన్ని డ్రైవర్లకు అందిస్తాయి. ఆ సమాచారం ఆధారంగా మనం నిర్దిష్ట వేగంతో వాహనాన్ని డ్రైవ్(Avoid Traffic Challan) చేసేందుకు అవకాశం కలుగుతుంది. ఫలితంగా ఛలాన్ల బెడద తప్పుతుంది. అంతేకాదు.. రోడ్డు ప్రమాదాల రిస్కు కూడా తగ్గిపోతుంది.
Also Read :DSC Exam : డీఎస్సీ హాల్ టికెట్లపై అభ్యర్థుల ఆందోళన.. ఎందుకు ?
స్పీడ్ లిమిట్ ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్‌లో మనం ఆన్ చేసుకుంటే.. మన వాహనం వేగం పరిమితికి మించితే అలర్ట్ చేస్తుంది. మనకు వార్నింగ్స్ జారీ చేస్తుంది. ఇది స్పీడ్ ఇండికేటర్ రంగులను మారుస్తుంది.హైవేపై మనం వాహనాలను కొంత వేగంగా నడపొచ్చు. కానీ లోకల్ రోడ్లపై అతివేగం పనికిరాదు. కొన్నిసార్లు మనం హైవే పైనుంచి లోకల్ రోడ్లపైకి ఎంటరయ్యాక కూడా స్పీడును తగ్గించం. అలాంటి సమయాల్లో అనవసరంగా ఛలాన్ కట్టాల్సి వస్తుంది. ఈ రిస్క్ నుంచి తప్పించుకోవాలంటే గూగుల్ మ్యాప్స్‌లోని స్పీడోమీటర్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. వాస్తవానికి ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు 2019 మే నెల నుంచే ఈ రెండు ఫీచర్లు(Google Maps) అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఈ 2 ఫీచర్లను ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. అధునాతన టెక్నాలజీని వాడుకొని డ్రైవింగ్ వేళ మన అతివేగానికి కళ్లెం వేసుకోవడం మంచి ఉపాయం.