HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Doesnt Have That Courage Ktr

సీఎం రేవంత్‌ రెడ్డికి ఆ ధైర్యం లేదు : కేటీఆర్‌

దానం నాగేందర్‌ని రాజీనామా చేయించేందుకు చేస్తున్న ప్రయత్నాల వెనుక అసలు ఉద్దేశ్యం కడియం శ్రీహరీని రక్షించడం మాత్రమేనని ఆయన ఆరోపించారు.

  • By Latha Suma Published Date - 05:23 PM, Fri - 21 November 25
  • daily-hunt
CM Revanth Reddy doesn't have that courage: KTR
CM Revanth Reddy doesn't have that courage: KTR

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తనను అరెస్ట్ చేసే ధైర్యం లేదని అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై, కాంగ్రెస్ నేతల వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు. ఈ-కార్ రేసు కేసు (E-car race case)తమపై మోపిన ఆరోపణలు ఆధారహీనమని ఆ కేసులో ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్‌కే తెలుసని కేటీఆర్ స్పష్టం చేశారు. నేను ఏ తప్పూ చేయలేదు. కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్‌కైనా సిద్ధంగా ఉన్నా అని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ మార్చిన ఎమ్మెల్యేల వ్యవహారంపై కూడా కేటీఆర్ కఠిన విమర్శలు చేశారు. దానం నాగేందర్‌ని రాజీనామా చేయించేందుకు చేస్తున్న ప్రయత్నాల వెనుక అసలు ఉద్దేశ్యం కడియం శ్రీహరీని రక్షించడం మాత్రమేనని ఆయన ఆరోపించారు.

Jan Suraaj Party : మాకూ రూ.1000 ఇవ్వండి.. ప్రశాంత్ కిషోర్ విజ్ఞప్తి!

స్పీకర్ ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ప్రభుత్వం పెద్ద ఇబ్బందుల్లో పడుతుందని ఆ అవమానాన్ని తప్పించుకోవడానికే కాంగ్రెస్ ఈ రాజీనామా నాటకానికి తెరలేపిందని ఘాటుగా విమర్శించారు. ముందుగానే కొందరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు దారి తీసే ప్రణాళిక ప్రభుత్వం సిద్ధం చేసుకుందని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల షెడ్యూల్‌పై కూడా కేటీఆర్ విశ్లేషణ కొనసాగింది. ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆ తర్వాతే ఉపఎన్నికలు నిర్వహిస్తారని ఆయన అంచనా వేశారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యూహాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, ప్రజా సమస్యలను మాత్రం పక్కకు నెట్టేస్తోందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు అవసరమైన సేవలు, అభివృద్ధి చర్యలు, ప్రాథమిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కుతంత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Krishna River Water : చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్.!

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు వెళ్లడం కాదు తిరిగి వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమపై తప్పుడు కేసులు పెట్టడం ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడం ద్వారా ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. “రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గాయి, పరిశ్రమలు వెనుకంజ వేస్తున్నాయి యువత అవకాశాల కోసం అసహనంగా ఎదురుచూస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రతీకారాలతో బిజీగా ఉంది” అని విమర్శించారు. పార్టీ బలాన్ని నిలబెట్టేందుకు, ప్రజా మద్దతును పెంపొందించేందుకు బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు చేపడుతుందని తాను ఎలాంటి ఒత్తిడులకు లొంగనని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు, విచారణలతో తనను భయపెట్టలేరని, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో ఎన్నికలు చూపిస్తాయని తెలిపారు. కాంగ్రెస్ చేసిన తప్పులను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రతి చర్యకూ సమాధానం ఇవ్వాల్సిన రోజు వారిపై వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కేటీఆర్ సవాలు ఆరోపణలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతోంది అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CM Revanth Reddy
  • danam nagender
  • Defection
  • E car race case
  • GHMC Elections
  • Kadayam Srihari
  • ktr
  • MLAs
  • telangana

Related News

Cbn Jagan

Krishna River Water : చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా నదీజలాల్లో తెలంగాణ ప్రభుత్వం 763 టీఎంసీల వాటా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ ప్రజల హక్కులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరించాల్సిన సమయం వచ్చిందంటూ వైఎస్ జగన్ లేఖ రాశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేలా వాదనలు వినిపించాలని.. బచావత్ ట్రిబ్యునల్

  • Ktr

    BRS Alleges : 9300 ఎకరాల కుంభకోణంలో రేవంత్‌..కేటీఆర్‌ షాకింగ్!

  • Indiramma Sarees Telangana

    Indiramma Sarees : రాష్ట్రంలో ప్రతి మహిళకూ చీర..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • Cold Wave

    Cold Wave : తెలంగాణలో ఎముకలు కొరికే చలి

  • BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

    RK Rule : తెలంగాణలో ఆర్కే పాలన అంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..అసలు ఎవరు ఆర్కే..?

Latest News

  • మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై ..కేంద్ర కమిటీ సంచలన ప్రకటన

  • GST : జీఎస్టీ తగ్గించినా ధరలు తగ్గకపొవడానికి కారణాలివే..!

  • సీఎం రేవంత్‌ రెడ్డికి ఆ ధైర్యం లేదు : కేటీఆర్‌

  • Tejas Fighter Jet Accident : దుబాయ్ ఎయిర్‌షోలో భారత ‘తేజస్’ యుద్ధవిమానం కూలింది; పైలట్ స్థితిపై స్పష్టత లేదు

  • Jan Suraaj Party : మాకూ రూ.1000 ఇవ్వండి.. ప్రశాంత్ కిషోర్ విజ్ఞప్తి!

Trending News

    • Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!

    • Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

    • Earthquake : బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రత భూకంపం… కోల్కతా, దక్షిణ బెంగాల్‌లో స్పష్టంగా అనుభవించిన ప్రకంపన!

    • New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!

    • IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆట‌గాళ్ల‌పై రూ. 20 కోట్ల వర్షం కురవనుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd