HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Challenges Former Cm Kcr

CM Revanth Reddy: కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.. ఏ విష‌యంలో అంటే!

కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే, ఆయన నిర్ణయించిన తేదీన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మంత్రుల బృందాన్ని పంపి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని, అవసరమైతే తాను స్వయంగా హాజరవుతానని సీఎం ప్రకటించారు.

  • Author : Gopi Date : 09-07-2025 - 9:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు బహిరంగ సవాల్ విసిరారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదం, రైతుల సంక్షేమం, రెండు ప్రభుత్వాల హయాంలో తీసుకున్న నిర్ణయాలపై శాసనసభలో సమగ్ర చర్చకు రావాలని ఆయన ఆహ్వానించారు. రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సవాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రజా భవన్‌లో నీటిపారుదల శాఖ మంత్రి త్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా బేసిన్ జలాల విభజనపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. “కేసీఆర్ అనుభవాన్ని మేం గౌరవిస్తాం. తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే సూచనలు ఆయన నుంచి వస్తే తప్పక పరిగణనలోకి తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిపుణుల అభిప్రాయాలు, స్టేక్‌హోల్డర్ల సలహాలతో సభలో అర్థవంతమైన చర్చ జరపడానికి సిద్ధం” అని ఆయన పేర్కొన్నారు.

Also Read: IND vs ENG 3rd Test: ఇంగ్లాండ్ జ‌ట్టులోకి జోఫ్రా ఆర్చ‌ర్ రీఎంట్రీ.. క‌లిసొస్తుందా?

“మీరు శాసనసభ సమావేశాలు పెట్టాలని స్పీకర్‌కు ఎప్పుడు లేఖ రాసినా మేం సిద్ధం. మీ హయాంలో, మా హయాంలో తీసుకున్న నిర్ణయాలపై బహిరంగంగా చర్చిద్దాం. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా, ఎలాంటి గందరగోళం లేకుండా, ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటాం” అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే, ఆయన నిర్ణయించిన తేదీన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మంత్రుల బృందాన్ని పంపి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని, అవసరమైతే తాను స్వయంగా హాజరవుతానని సీఎం ప్రకటించారు. “కాదు కూడదు, నేనూ రావాలంటే, ఎర్రవల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశానికి రావడానికి సిద్ధం. వాస్తవాలను ప్రజల ముందు ఉంచడమే మా ఉద్దేశం,” అని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ హక్కులను ఎవరికీ తాకట్టు పెట్టబోమని, రాష్ట్ర హక్కుల కోసం దేవుడు ఎదురొచ్చినా నిటారుగా నిలబడి పోరాడతామని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఈ సవాల్‌పై కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CM Revanth Reddy
  • congress
  • Former CM KCR
  • hyderabad
  • telangana
  • telugu news

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd