CM Revanth Style: సీఎం రేవంత్ డ్రెస్సింగ్ స్టైల్‌లో ట్రెండ్ సెట్టరే!
ఇకపోతే తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ మిగతా రాజకీయ నాయకులు కంటే భిన్నంగా ఉంటుంది. ఉంది కూడా. ప్రభుత్వానికి సంబంధించిన సమావేశాల్లో ఆయన ఎక్కువ శాతం వైట్ షర్ట్ అండ్ బ్లాక్ పాయింట్‌తో కనిపిస్తుంటారు.
- By Gopichand Published Date - 09:43 AM, Mon - 13 January 25

CM Revanth Style: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Style) రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 2023లో తెలంగాణ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమదైన నిర్ణయాలతో ప్రజలకు, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు సాయం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సీఎం రేవంత్ సర్కార్ హైదరాబాద్‌ను బ్రాండ్ సిటీగా మార్చేందుకు కసరత్తులు చేస్తోంది.
అయితే సీఎం రేవంత్ ప్రతిపక్షాలు విమర్శలు ఎంత ఘాటుగా ఉంటాయా మనకు తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుడు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వారి డ్రెస్సింగ్ స్టైల్. గతంలో పొలిటిషన్ వైట్ అండ్ వైట్ వేసి ప్రత్యేకత చూపేవారు. ఇప్పటికీ చాలామంది రాజకీయ నాయకులు ఇదే స్టైల్‌ను ఫార్మాట్ చేస్తున్నారు. తెలంగాణను పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా వైట్ అండ్ వైట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన తనయుడు కేటీఆర్ సైతం వివిధ రకాల డ్రెస్సింగ్‌తో కనిపించేవారు. ఆయన ఇంట్లో ఉంటే టీ షర్ట్‌లతో ఉన్న చాలా ఫొటోలు మనకు ఇంటర్నెట్‌లో తారసపడతాయి.
Also Read: PM Modi : ఇవాళ సాయంత్రం కిషన్ రెడ్డి నివాసానికి ప్రధాని మోడీ.. ఎందుకో తెలుసా ?
డ్రెస్సింగ్ లో సీఎం రేవంత్‌ది విభిన్నమైన స్టైల్
ఇకపోతే తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ మిగతా రాజకీయ నాయకులు కంటే భిన్నంగా ఉంటుంది. ఉంది కూడా. ప్రభుత్వానికి సంబంధించిన సమావేశాల్లో ఆయన ఎక్కువ శాతం వైట్ షర్ట్ అండ్ బ్లాక్ పాయింట్‌తో కనిపిస్తుంటారు. ఈ లుక్‌లో సీఎం రేవంత్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటారని గతంలో సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేశారు కూడా. అయితే నార్మల్ టైమ్‌లో ఆయన డ్రెస్సింగ్ స్టైల్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే నమ్ముతారా! సీఎం రేవంత్ తన ఇంట్లో అధికారులతో సమీక్ష చేసే సమయంలో ఎక్కువ శాతం టీ షర్ట్స్ తోనే కనిపిస్తుంటారు. ఒక సీఎం స్థాయిలో ఉండి సాధారణంగా ఉండే టీ షర్టులు, పాయింట్లు, చొక్కాలు ధరించి సామాన్యులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. ఒక రాష్ట్ర సీఎం ఇలా సాదాసీదాగా ఉండటం తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి అని సామాన్యులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.