PM Modi : ఇవాళ సాయంత్రం కిషన్ రెడ్డి నివాసానికి ప్రధాని మోడీ.. ఎందుకో తెలుసా ?
ఆ కీలక పదవి కిషన్ రెడ్డిని(PM Modi) వరిస్తుందనే ప్రచారం కూడా బలంగా జరుగుతోంది.
- By Pasha Published Date - 09:18 AM, Mon - 13 January 25

PM Modi : ఇవాళ (జనవరి 13న) సాయంత్రం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేరుకోనున్నారు. కిషన్ రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలో ఘనంగా జరిగే సంక్రాంతి వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. ఆ కార్యక్రమం వేదికగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోడీ సంక్రాంతి, భోగి పండుగల శుభాకాంక్షలు చెబుతారు. కిషన్ రెడ్డి డిల్లీ నివాసాన్ని ప్రధాని మోడీ సందర్శించనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ రాక నేపథ్యంలో కిషన్ రెడ్డి నివాసానికి పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు, పలువురు తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా చేరుకుంటారని తెలిసింది.
Also Read :GOVT Star Hotel : రూ.582 కోట్లతో హైదరాబాద్‌లో ప్రభుత్వ ఫైవ్ స్టార్ హోటల్.. ఎందుకో తెలుసా ?
ఈ కార్యక్రమం ద్వారా కిషన్ రెడ్డికి ప్రధాని మోడీ ఇస్తున్న ప్రాధాన్యం మరోసారి అందరికీ తెలిసొచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న పార్టీ సీనియర్ నేతల జాబితాలో కిషన్ రెడ్డి పేరు కూడా ఉంది. ఆ కీలక పదవి కిషన్ రెడ్డిని(PM Modi) వరిస్తుందనే ప్రచారం కూడా బలంగా జరుగుతోంది. ఇవాళ సాయంత్రం కిషన్ రెడ్డి నివాసంలో జరిగే కార్యక్రమానికి ప్రధాని హాజరుకానుండటం ఆ ప్రచారానికి బలం ఇచ్చేలా ఉంది. ఒకవేళ కిషన్ రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్కితే అది తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్కిన గౌరవం అవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన బీజేపీకి జాతీయ స్థాయిలో సారథ్యం వహించే అవకాశం ఒక తెలుగు వ్యక్తికి వస్తే అంతకంటే కావాల్సింది ఇంకేం ఉంటుంది.
Also Read :Chandrababu In Naravaripalle : బుధవారం వరకు నారావారిపల్లెలోనే చంద్రబాబు.. భోగి శుభాకాంక్షలు చెప్పిన సీఎం
దక్షిణాదిలో కిషన్‌రెడ్డికి కీలక బాధ్యతలు
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతంపై ప్రధాని మోడీ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈక్రమంలో కిషన్ రెడ్డికి ఇటు పార్టీ వ్యవహారాలు, అటు కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలను మోడీ అప్పగించారు.మోడీ, అమిత్ షాలకు కిషన్ రెడ్డి పనితీరుపై బాగా నమ్మకం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తమిళనాడు ఎన్నికల ఇన్‌ఛార్జిగా కిషన్ రెడ్డికి మోడీ బాధ్యతలు అప్పగించారు. జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్‌ఛార్జిగానూ కిషన్ రెడ్డి వ్యవహరించారు. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఇన్‌ఛార్జిగా బీజేపీ నియమించింది. ఈ అంశాల వల్లే కిషన్ రెడ్డి పేరును బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి కూడా పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.