HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth And Kcr Extend Dussehra Greetings To The People Of The State

Dussehra: రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం రేవంత్‌, కేసీఆర్‌!

విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ పవిత్రమైన సందర్భంగా ఆయన బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • Author : Gopi Date : 01-10-2025 - 7:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dussehra
Dussehra

Dussehra: శరన్నవరాత్రుల ముగింపు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దసరా పండుగ (Dussehra) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా విజయదశమి పేరుతో ఘనంగా జరుపుకుంటున్నారని, ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమని ఆయన గుర్తు చేశారు.

దసరా పండుగ తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిలోని ప్రత్యేక అంశాలను ఆయన ప్రస్తావించారు. శమీ పూజ చేసి, జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడమ‌ని సీఎం గుర్తు చేశారు. ఈ ఆచారాలు తెలంగాణకు ప్రత్యేకమని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం అప్రతిహత విజయాలతో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఈ పండుగ జరుపుకోవాలని తాను దుర్గామాతను ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Also Read: Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

మంత్రి శుభాకాంక్ష‌లు

విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ పవిత్రమైన సందర్భంగా ఆయన బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపిన కేసీఆర్‌

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు దసరా పండుగ (విజయదశమి) శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పండుగ యొక్క జీవన తాత్వికతను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మనిషి తనలోని చెడుపై నిత్యం పోరాటం చేస్తూ, మంచి దిశగా విజయం సాధించాలనే సందేశాన్ని ఈ పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • dussehra
  • hyderabad
  • kcr
  • telangana
  • telugu news

Related News

34 Dead Due to Heatstroke in Telangana

Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో వడదెబ్బతో 34 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివా

  • Do you eat fast food? Be careful—experts warn that there is a risk of developing high blood pressure.

    Hyderabad: ఫాస్ట్​ఫుడ్ తింటున్నారా? జాగ్రత్త రక్తపోటు వచ్చే ఛాన్స్ ఉందంటున్న నిపుణులు

  • kurchi-thatha-dies-of-heart-attack

    Kurchi Thatha: గుండెపోటుతో కుర్చీ తాత మృతి

  • Condom packet in a beer bottle

    Condom Packet: బీరు సీసాలో కండోమ్ ప్యాకెట్

  • Good News for the People of Telangana: New Pensions—Starting From When?

    New Pensions: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కొత్త పెన్షన్లు.. ఎప్పటి నుంచంటే..?

Latest News

  • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

  • PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

  • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

  • Cm Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో అపోలో హాస్పిటల్స్ డాక్టర్ ప్రీతారెడ్డి భేటీ

Trending News

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd