Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డికి విరాళం అందజేసిన చిరంజీవి, టాలీవుడ్ హీరోలు
Chiranjeevi and Tollywood heroes donated to CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు విరాళం ఇచ్చారు. రామ్ చరణ్ తరఫున మరో రూ.50లక్షలు అందజేశారు. ఈమేరకు సీఎం రేవంత్‌ను కలిసి చెక్కులను ఇచ్చారు.
- By Latha Suma Published Date - 02:33 PM, Mon - 16 September 24

Chiranjeevi and Tollywood heroes donated to CM Revanth Reddy: ఇటీవల వచ్చిన వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు సాయం అందజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు విరాళం ఇచ్చారు. రామ్ చరణ్ తరఫున మరో రూ.50లక్షలు అందజేశారు. ఈమేరకు సీఎం రేవంత్‌ను కలిసి చెక్కులను ఇచ్చారు. అమర్ రాజా గ్రూప్ తరఫున సీఎం సహాయనిధికి మంత్రి గల్లా అరుణ కుమారి రూ.కోటి విరాళం, సినీ నటులు అలీ రూ.3 లక్షలు, విశ్వక్ సేన్ రూ.10లక్షలు అందజేశారు. సినీ నటుడు సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు, గరుడపల్లి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ సంజయ్ గరుడపల్లి రూ.25 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. ఈ తరునంలోనే… సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నటులు చెక్కులు అందించారు.
తెలంగాణ సీఎం సహాయ నిధికి తన తరఫున 50లక్షలు, రాంచరణ్ తరఫున 50లక్షల విరాళం అందించిన మెగాస్టార్ చిరంజీవి #Chiranjeevi #RamCharan𓃵 #RevanthReddy #Seethakka #HashtagU pic.twitter.com/nV6FIxXjhV
— Hashtag U (@HashtaguIn) September 16, 2024
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో సీఎం రేవంత్ రెడ్డి కాసేపు చర్చించి… శాలువాతో చిరును సత్కరించారు. మరోవైపు, సినీ రాజకీయ ప్రముఖులు తెలుగు రాష్ట్రాలలోని వరద బాధితులకు విరాళాలు అందజేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆ మొత్తాన్ని బాధితులకు అందేలా చేస్తూ వారిని ఆదుకుంటున్నారు.
కాగా, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇటీవల వరదలు సంభవించి, జనజీవనాన్ని అతలాకుతలం చేయడం తెలిసిందే. ముఖ్యంగా, ఖమ్మం పట్టణం వరద బీభత్సానికి గురై అస్తవ్యస్తంగా మారింది. దాదాపు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా విరాళాలు ప్రకటించిన సంగతి తేలిసిందే.