HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Creates 119 War Rooms

BRS War Room: బీఆర్ఎస్ వార్ రూమ్స్ లో అసలేం జరుగుతోంది?

యుద్ధ రంగంలో సైనికుల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. ఎన్నికల యుద్ధ రంగంలో బీఆర్ఎస్ నిర్మించిన వార్రూమ్స్ లో సైనికుల చేతుల్లో ల్యాప్టాప్ లు ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక వార్ రూమ్ లో డిజిటల్ నిపుణులు ల్యాప్టాప్ ద్వారా అభ్యర్థులు,

  • Author : Praveen Aluthuru Date : 25-10-2023 - 7:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brs War Room (1)
Brs War Room (1)

డా. ప్రసాదమూర్తి

BRS War Room: యుద్ధ రంగంలో సైనికుల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. ఎన్నికల యుద్ధ రంగంలో బీఆర్ఎస్ నిర్మించిన వార్రూమ్స్ లో సైనికుల చేతుల్లో ల్యాప్టాప్ లు ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక వార్ రూమ్ లో డిజిటల్ నిపుణులు ల్యాప్టాప్ ద్వారా అభ్యర్థులు, పార్టీ నాయకులు, ఓటర్లు పార్టీ అధిష్టానానికి మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు. 119 నియోజకవర్గాల్లో ఉండే ఈ వార్ రూమ్స్ నుండి నియోజకవర్గం వారీగా సమాచారం అంతా రాష్ట్రస్థాయి వార్ రూమ్ కి చేరుతుంది. ప్రతి వార్ రూమ్ కి నలుగురైదుగురు పర్యవేక్షకులు ఉంటారు. వీరిలో ఎక్కువగా పార్టీ అభిమానులు, లేదా పోటీలో ఉన్న అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఉంటారు. వీరికి ప్రతి గ్రామ స్థాయిలోనూ కావలసిన సమాచారాన్ని అందించడానికి సహాయకులు ఉంటారు.

వార్ రూమ్స్ నుండి కీలక సమాచారం:
బీఆర్ఎస్ గత పదేళ్లుగా అధికారంలో ఉంది. సాధారణంగా ప్రజలు అధికారంలో ఉన్న పార్టీని చవిచూసిన తర్వాత, కొత్త ప్రభుత్వాన్ని కూడా చూస్తే ఎలా ఉంటుందనే ఉత్సాహాన్ని ఎక్కువగా చూపిస్తారు. ఇప్పటికే సర్వేలు చెబుతున్న దాని ప్రకారం బీఆర్ఎస్ కు రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో వ్యతిరేకత ఉన్నట్టు అర్థమవుతుంది. అయితే ఈ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అనేది చాలా కీలకమైన విషయం. వ్యతిరేకత ప్రాథమిక స్థాయిలో ఉంటే, తమ పథకాలను సరిగా అందుకోలేక అసంతృప్తితో ఉంటే అలాంటి వ్యతిరేకతను సరిదిద్దుకోవచ్చు. తటస్థంగా ఉన్న ఓటర్లను తమ వైపు లాక్కోవచ్చు. అసంతృప్తితో ఉన్న నాయకులను బుజ్జగించడం ద్వారా కొంత వ్యతిరేకతను తగ్గించుకోవచ్చు. పూర్తిస్థాయిలో వ్యతిరేకంగా ఓటర్లు ఎంతమంది ఉన్నారు, దానికి కారణాలు ఏమిటి అనేది కూడా ఒక అంచనాకు రావచ్చు. ఇలా ఈ మొత్తం కార్యాచరణను అమలు పరచాలంటే గ్రామస్థాయి నుండి పూర్తి సమాచారం కేంద్ర స్థాయికి చేరుకోవాలి. ఆ సమాచారాన్ని అందించడానికి ఈ వార్ రూమ్స్ ని ఏర్పాటు చేశారు. ఇందులో పనిచేసే నిపుణుల వద్ద ప్రతి ఓటర్ యొక్క సమాచారం ఉంటుంది. ఓటరు రాజకీయ వైఖరి, మారుతున్న రాజకీయ ధోరణులు, సామాజిక స్థితిగతులు మొదలైన పూర్తి సమాచారం వార్ రూమ్ కి చేరుతుంది. దాని ఆధారంగా ఒక సామాన్య సూత్రాన్ని తీసుకొని, ఆ మేరకు లోపాలను సరిదిద్దుకొని, మెరుగైన ఎన్నికల ప్రచారం సాగించడానికి ఈ వార్ రూమ్స్ నుండి వస్తున్న సమాచారం కీలకంగా పనిచేస్తుంది

యువతలో అసంతృప్తి:
ఉద్యోగాల రూపకల్పనలో, పరీక్షల నిర్వహణలో, ప్రభుత్వం కొంత వైఫల్యం చెందిన విషయం యువతలో తీవ్ర అసంతృప్తిగా మారింది. తమ పట్ల యువత కొంచెం గుర్రుగా ఉన్నట్టు స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీ రామారావు అంగీకరించారు. యువతను తమవైపు ఆకర్షించే మెరుగైన ప్రణాళికలు రచించి, పథకాలు ప్రవేశపెట్టి, వాటిని వారి దాకా తీసుకువెళ్లే కార్యక్రమాన్ని కూడా ఈ వార్ రూమ్స్ అందించిన సమాచారం ఆధారంగా రూపొందించుకుంటారు. ప్రతి ఒక్క ఓటర్ ని మాలిమి చేసుకొని పోలింగ్ బూత్ వరకూ తీసుకువెళ్లే దాకా తాము కష్టించి పనిచేస్తామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. సభలు, సమావేశాలు, వాగ్దానాలు, పథకాలు, ప్రచారాలు ఒక ఎత్తు కాగా, ఈ వార్ రూమ్స్ ద్వారా సాధించే విజయం మరొక ఎత్తు కాగలదు. అందుకే బిఆర్ఎస్ నాయకులు వార్రూమ్స్ ని చాలా కీలకమైనవిగా భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునే దిశగా పాలకులు పయనించడంలో ఈ వార్ రూమ్స్ ఎలా ఉపయోగపడతాయో, ఇలాంటి ప్రయత్నాల్లో ఇతర పార్టీలు కూడా ఎలాంటి ముందడుగు వేస్తాయో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ నాయకులు తమ ప్రచార రంగంలో ఈ వార్ రూమ్స్ ని మాత్రం తిరుగులేని ఆయుధాలుగా మార్చుకున్నారని చెప్పాలి.

Also Read: Thalaivar 170: ఇద్దరు లెజెండ్స్ కలిసిన వేళ.. అమితాబ్ తో రజనీ స్క్రీన్ షేర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 119
  • bjp
  • brs
  • congress
  • Elections 2023
  • kcr
  • telangana
  • War Room

Related News

bjp Mp Godam Nagesh

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్ల

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Jangaon Thorrur Congress

    లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd