HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp Want To Form New Alliances Ahead Of Lok Sabha Polls 2024

BJP New Alliances : 2024లో కొత్త “పొత్తు” పొడుపులు..బీజేపీకి న్యూ ఫ్రెండ్స్

Bjp New Alliances : దేశంలో పాలిటిక్స్ హీటెక్కాయి.. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం పార్టీలన్నీ ప్లానింగ్ రెడీ చేస్తున్నాయి..  ఓ వైపు విపక్షాలు ఏకమయ్యేందుకు ప్లాన్ చేస్తుంటే.. మరోవైపు బీజేపీ తన మిత్రులెవరు, శత్రువులెవరు అనేది గుర్తించే పనిలో పడింది.

  • Author : Pasha Date : 09-06-2023 - 3:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bjp New Alliances
Bjp New Alliances

BJP New Alliances : దేశంలో పాలిటిక్స్ హీటెక్కాయి.. 

వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం పార్టీలన్నీ ప్లానింగ్ రెడీ చేస్తున్నాయి..  

ఓ వైపు విపక్షాలు ఏకమయ్యేందుకు ప్లాన్ చేస్తుంటే.. మరోవైపు బీజేపీ తన మిత్రులెవరు, శత్రువులెవరు అనేది గుర్తించే పనిలో పడింది.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో జోష్ పెంచగా.. బీజేపీ లో అప్రమత్తతను పెంచాయి..  

దీంతో తన రాజకీయ కూటమి నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్డీయే)ను బలోపేతం చేయడంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. 

విపక్ష కూటమి ఊసెత్తకుండా.. కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న ప్రాంతీయ పార్టీలను అక్కున చేర్చుకునేందుకు(Bjp New Alliances) కమల దళం రెడీ అవుతోంది. మొన్న అసెంబ్లీ పోల్స్ జరిగిన కర్ణాటక నుంచి మొదలుకొని..  ఈనెల 23న దేశంలోని విపక్షాల మీటింగ్ జరగనున్న బీహార్ వరకు ప్రతిచోటా ఈవిధమైన పార్టీలతో దోస్తీ చేసేందుకు బీజేపీ తలుపులు తెరిచింది. ఇందుకు ఆసక్తి చూపుతున్న పార్టీల అధినేతలతో ఇప్పటికే మంతనాలు మొదలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ నే చూస్తే .. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు రెడీగా ఉన్నారు. ఆయన  ఒక అడుగు ముందుకు వేసి  కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఇటీవల  సమావేశమయ్యారు. ఆ సందర్భంగా పొత్తుల ప్రస్తావన కూడా తెచ్చారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల చీలిక జరగదని.. ఫలితంగా వైఎస్సార్ సీపీని ఓడించడం ఈజీ అవుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే అంటున్నారు. ఒకవేళ టీడీపీతో పొత్తుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అందులో జనసేన కూడా చేరిపోయే ఛాన్స్ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ కూడా సన్నిహితంగానే  మెలుగుతోంది. బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంట్‌లో ఫ్లోర్ కో-ఆర్డినేషన్‌లో నమ్మకమైన భాగస్వామిగా సీఎం జగన్ పార్టీ ఉంది.  ఎంత సాన్నిహిత్యంగా ఉన్నా .. ప్రజా క్షేత్రంలో కలిసి నడిచే పార్టీతోనే పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ సిద్ధం కావచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ

తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్  వంటి కొత్త నేతలు  పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో   పోటీపడుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 119 స్థానాల్లో బీజేపీకి సరిపడా అభ్యర్థులు లేరు. కర్నాటకలో సాధించిన విజయంతో తెలంగాణ కాంగ్రెస్ లో భారీగా చేరికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు వరకు బీఆర్ఎస్, బీజేపీల నుంచి కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ లో  జోష్ నింపేందుకు ప్రియాంకా గాంధీ స్వయంగా వివిధ సభల్లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఇక అధికార బీఆర్ఎస్ పార్టీ  సంక్షేమ పథకాలే తమను మళ్ళీ గెలిపిస్తాయనే ధీమాలో ఉంది.

Also read : TDP, BJP and Janasena: తెలంగాణపై ‘ఆంధ్రా’ పొత్తులు.. మోడీ వ్యూహం ఫలించేనా!

కర్ణాటక

కర్ణాటకలో ఘోర పరాజయాన్ని చవిచూసిన జనతాదళ్ (సెక్యులర్) పొత్తు కోసం బీజేపీని సంప్రదించవచ్చనే  ప్రచారం జరుగుతోంది. JD(S)కి ఇది దీర్ఘకాలిక వ్యూహం కాకుండా మనుగడ కోసం స్వల్పకాలిక వ్యూహం. బీజేపీ -జేడీ(ఎస్) కూటమి  ఏర్పడితే..  వొక్కలిగ వర్గం ఓట్లపై బీజేపీకి కొంత పట్టు వస్తుంది. తద్వారా లింగాయత్ పార్టీ అనే ట్యాగ్ ను పోగొట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. పొత్తులో భాగంగా హాసన్, మాండ్య, బెంగుళూరు (రూరల్), చిక్కబల్లార్‌పూర్‌లలో నాలుగు లోక్‌సభ స్థానాలను తమ పార్టీ కోసం పక్కన పెట్టాలని బీజేపీని  JD(S) డిమాండ్ చేస్తోంది.

బీహార్ 

దేశంలోని విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కు చెందిన పార్టీ జనతాదళ్ (యు) పై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ నుంచి చేరికలను ప్రోత్సహించేందుకు కమల దళం కసరత్తు మొదలు పెట్టింది. ఈనెల 23న పాట్నాలో విపక్ష కూటమి మీటింగ్ ఉండగా.. అంతకంటే ముందే ప్రధాని మోడీ తో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు బీహార్ బీజేపీ ప్లానింగ్ చేస్తోంది. ఈ సభ సందర్భంగా  జనతాదళ్ (యు), ఆర్జేడీ కీలక నేతలు బీజేపీ లో చేరుతారనే టాక్ వినిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ahead
  • ap
  • bihar
  • bjp
  • Bjp New Alliances
  • chandrababu naidu
  • jds
  • jdu
  • karnataka
  • Lok Sabha polls
  • new alliances
  • polls 2024
  • tdp
  • ysrcp

Related News

Prashant Kishor To Contest

Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు.

  • Vip Break Darshan For 116 Y

    TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

  • Big shock for YouTuber Ravan

    YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

  • Cm Chandrababu Naidu Chat W

    Kuppam : అలాంటి ప్రచారాలతో రాష్ట్ర అభివృద్ధి ఆగదు : సీఎం చంద్రబాబు

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd