Bandi Sanjay : ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు అరెస్ట్‌పై బండి సంజయ్..
తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ(Telangana) బీజేపీ(BJP) నేత బండి సంజయ్(Bandi Sanjay) మాట్లాడారు.
- Author : News Desk
Date : 12-09-2023 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ(AP)లో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ నాయకులే కాక దేశంలోని పలు రాష్ట్రాల నాయకులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ(Telangana) బీజేపీ(BJP) నేత బండి సంజయ్(Bandi Sanjay) మాట్లాడారు.
బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే ముఖ్యమంత్రిగా సుధీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తిని, ప్రతిపక్ష నేతను తెల్లవారు జామున అరెస్ట్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంతో తెలుగుదేశం పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో సానుభూతి పెరిగింది. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. కానీ ఆయన్ని అరెస్ట్ చేసే పద్ధతి ఇది కాదు అని వ్యాఖ్యానించారు.
Also Read : Telangana Elections : మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు అని కేటీఆర్..లేదు లేదు అని కిషన్ రెడ్డి..ఎవరి మాట నిజం..?