Telangana Elections : మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు అని కేటీఆర్..లేదు లేదు అని కిషన్ రెడ్డి..ఎవరి మాట నిజం..?
షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని..కేటీఆర్ చెప్పినట్లు ఏవి జరగవని అన్నారు.
- By Sudheer Published Date - 09:11 PM, Tue - 12 September 23

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections) ఎప్పుడు వస్తాయో స్పష్టంగా తెలియనప్పటికీ..రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటి నుండే ఎన్నికల హడావిడి మొదలుపెట్టింది. ఇప్పటికే అధికారపార్టీ బిఆర్ఎస్ (BRS) తమ అభ్యర్థులను ప్రకటించగా..బిజెపి (BJP) , కాంగ్రెస్ (Congress) పార్టీలు అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణలో బిజీగా ఉన్నాయి. ఈ నెల చివరికల్లా మొదటి విడత లిస్ట్ ను ప్రకటించాలని చూస్తున్నాయి. ఇదిలా ఉంటె తాజాగా బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్..ఎన్నికల ఫై ఓ వార్త తెలిపి ప్రజలను , పార్టీలను అయోమయంలో పడేసారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లో జరగడం అనుమానమేనని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. వచ్చే నెల పదో తేదీ లోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే డిసెంబర్ లో జరుగుతాయని లేకపోతే పార్లమెంట్ తో పాటు మార్చి, ఏప్రిల్ , మే లో ఎన్నికలు జరుగుతాయన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఓ స్పష్టత రావొచ్చు అని వ్యాఖ్యానించారు. ఇదే సందర్బంగా బిజెపి పైన ఆయన విమర్శలు సంధించారు.
Read Also : Viral : భయం..భయం గా ‘భూమ్ భూమ్’ బీరు తాగిన నటుడు శ్రీకాంత్
ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై(మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ, రాజస్థాన్)ప్రధాని మోడీ బయపడుతున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సదరు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే.. ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని అనుకుంటున్నారని విమర్శించారు. అందుకే 5 రాష్ట్రాల ఎన్నికలను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే మధ్యప్రదేశ్‌లో ఒక్క దగ్గరే బీజేపీకి అవకాశం ఉందన్నారు. మిగతా రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం కష్టమేనని వ్యాఖ్యానించారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని..కేటీఆర్ చెప్పినట్లు ఏవి జరగవని అన్నారు. మరి వీరిద్దరి మాటల్లో ఎవరి మాట నమ్మొచ్చు..ఎవరు చెప్పినట్లు ఎన్నికలు జరుగుతాయి అనేది చూడాలి అంటున్నారు ఓటర్లు.