Bandi Sanjay: కేసీఆర్ దేశద్రోహి, మోదీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్: బండి
కరీంనగర్ ‘మహా బైక్ ర్యాలీ’లో పాల్గొన్న బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉందన్నారు.
- By Praveen Aluthuru Published Date - 03:15 PM, Sat - 11 May 24

Bandi Sanjay: కేసీఆర్ ను దేశద్రోహి, మోదీని భారత సంరక్షకుడిగా సంబోధిస్తూ తెలంగాణ బీజేపీ లీడర్ బండి సంజయ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ రోజు కరీంనగర్ ‘మహా బైక్ ర్యాలీ’లో పాల్గొన్న బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉందన్నారు.
బండి సంజయ్ మాట్లాడుతూ.. కొన్ని ఇస్లాం సంస్థలు భారత్ ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. నేను….హమ్ దో.. హమారే దో విధానానికి ఓటేస్తానాని చెప్పిన బండి సంజయ్, కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే.. హమ్ చార్.. హమారే చాలీస్ విధానానికి ఓటేస్తరన్నారు. కేసీఆర్ దేశద్రోహి…ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికపోతారనే భయంతో ఇంటెలిజెన్స్ వద్దనున్న దేశ భద్రత డేటాను కూడా ధ్వంసం చేశారని వ్యాఖ్యానించారు బండి. కేసీఆర్ లాంటి దేశద్రోహిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?, కేసీఆర్ చేసిన దేశభద్రత డేటా, దేశద్రోహంపై కేంద్రానికి నివేదిక ఎందుకు పంపలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే.. కేసీఆర్ ను బొక్కలో వేసే వాళ్లం. కేసీఆర్ ఫాంహౌజ్ లో గుసాయించి సర్జికల్ స్ట్రయిక్ చేసి దేశద్రోహులను ఏరిపారేసేవాళ్లమని మాట్లాడారు బండి సంజయ్.
సర్జికల్ స్ట్రయిక్ జరిగిందనడానికి ఆధారాలేంటని రేవంత్ రెడ్డి జవాన్లను అవమానిస్తున్నడని మండిపడ్డారు బండి సంజయ్. రేవంతన్నా… సరిహద్దుకు తీసుకుపోతా రా… సర్టికల్ స్ట్రయిక్స్ ఎట్లా చేసారో జవాన్లే నీకు రుచి చూపిస్తరు. మోదీ లేని భారత్ ను ఊహించుకోలేమని హీరో అని నువ్వే మోదీని పొగిడిన సంగతి మర్చిపోయినవా రేవంతన్న అంటూ వ్యగ్యం ప్రదర్శించారు. సౌతిండియన్లు ఆఫ్రికన్లలాగా ఉంటామని శ్యాంపిట్రోడాను ఉద్దేశించి కాంగ్రెసోళ్లు అవమానిస్తుంటే ఊరుకుందామా?, కాంగ్రెస్, బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలిపేయండి, నన్ను ఓడించేందుకు అసద్, బీఆర్ఎస్, కాంగ్రెస్) గ్యాంగ్ ఒక్కటైనయ్ అన్నారు. ముస్లింలంతా ఒక్కటై నన్ను ఓడించాలని కేసీఆర్ పిలుపునిస్తున్నడు. మీరే నా ధైర్యం… మీరే నా ఆశ… మీరే నా శ్వాస…నా పోరాటానికి అండ దండ మీరే. హిందూ బంధువులారా… కరీంనగర్ కు తరలివచ్చి నన్ను గెలిపించి మీ దమ్మేందో చూపించండి అంటూ ఓటర్లను విజ్ఞప్తి చేశారు బండి సంజయ్.
Also Read: Bandi Sanjay: కేసీఆర్ దేశద్రోహి, మోదీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్: బండి