HYDRA Demolitions: నెక్లెస్ రోడ్డును కూడా ప్రభుత్వం కూల్చివేస్తుందా? : ఒవైసీ
హైడ్రా కూల్చివేతలపై మజ్లీస్ అధ్యక్షుడు ఒవైసీ ఆసక్తికర రీతిలో స్పందించారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతంలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తుందా అని ప్రశ్నించారు. అలాగే నెక్లెస్ రోడ్డును కూడా కూల్చేస్తారా? అని అడిగాడు
- By Praveen Aluthuru Published Date - 06:14 PM, Sun - 25 August 24

HYDRA Demolitions: హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా పేరు వినిపిస్తుంది. బడా నేతలకు ముచ్చెమటలు పట్టిస్తుంది. అగ్రనటుడు నాగార్జునకే చుక్కలు చూపించింది. త్వరలో హైడ్రా నగరంలో బడా బాబుల పని పట్టబోతోంది. అయితే నగరంలో చెరువుల చుట్టు నిర్మించిన అన్ని భవనాలను హైడ్రా కూల్చివేస్తుందా అని ప్రశ్నించారు ఒవైసీ అధినేత అసదుద్దీన్. అంతేకాదు నెక్లెస్‌రోడ్ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని.. దాన్ని కూడా తొలగిస్తారా అని ఎంఐఎం అధినేత ప్రభుత్వాన్ని నిలదీశారు.
హైదరాబాద్ లో హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. బఫర్ ఫోన్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నాగార్జున అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ని నేలకూల్చిన హైడ్రా సంచలనంగా మారింది. భారీగా ఫిర్యాదులు అందుకుంటున్న తరుణంలో త్వరలో బడా బాబుల అంతు చూసేందుకు సిద్దమవుతుంది. ఇదిలా ఉండగా హైడ్రా చర్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రజలు హర్షిస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు దీన్ని కేవలం రాజకీయ కోణంలో చూస్తున్న పరిస్థితి.
హైడ్రా కూల్చివేతలపై మజ్లీస్ అధ్యక్షుడు ఒవైసీ ఆసక్తికర రీతిలో స్పందించారు. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) ప్రాంతాల్లో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కూల్చివేస్తారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నగరంలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతపై ఎఐఎంఐఎం చీఫ్, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.విలేకరులతో మాట్లాడిన ఒవైసీ.. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతంలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తుందా అని ప్రశ్నించారు. అలాగే నెక్లెస్ రోడ్డును కూడా కూల్చేస్తారా? అని అడిగాడు. ఒవైసీ ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నీటి చెరువుపై నిర్మించబడింది. దీంతో జీహెచ్‌ఎంసీ భవనాన్ని ప్రభుత్వం కూల్చివేస్తుందా? అని అడిగాడు.
Also Read: CM Revanth On Hydraa: హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేదే లేదు : సీఎం రేవంత్ రెడ్డి