HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Are All The Leaders In Telangana Shadows Of That Party

Telangana Leaders : తెలంగాణలో నాయకులంతా ఆ పార్టీ నీడలేనా..?

తెలంగాణలో (Telangana) అధికారంలో ఉన్న BRS, కేంద్రంలో అధికారంలో ఉన్న BJPతో లోపాయికారి ఒప్పందం పెట్టుకొని పైకి ఒకరినొకరు తిట్టుకుంటున్నట్టు నటిస్తున్నారని కాంగ్రెస్ వారు ఆరోపిస్తున్నారు.

  • Author : Hashtag U Date : 07-10-2023 - 10:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Are All The Leaders In Telangana Shadows Of That Party..
Are All The Leaders In Telangana Shadows Of That Party..

By: డా. ప్రసాదమూర్తి

Telangana Leaders : రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. ఎన్నికలు సమీపిస్తున్న కాలంలో ఇది ఎంత సహజమైన విషయమో ఇంకా ఇంకా స్పష్టంగా మనకు విదితమవుతుంది. కానీ ఒక్కోసారి ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న రాజకీయ నాయకుల తీరుతెన్నులు చూస్తే ఎవరి ఉద్దేశం ఏమిటో అర్థం కాక మనమంతా గందరగోళ పడిపోతాం. ఎవరు ఎవరిమీద ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు.. ఆ ఆరోపణలలో నిజమెంత.. ఆ ఆరోపణలు చేస్తున్నవారు నిజనిర్ధారణ చేసి తమ నిజాయితీని నిరూపించుకుంటారా.. తాము చేస్తున్న ఆరోపణలు వెనక సత్యం ఎంత ఉందో ఆధారాలతో సహా ప్రజల ముందుకు వస్తారా.. ఇలాంటి సందేహాలు ఎవరికి కలిగినా, ఇలాంటి ప్రశ్నలు ఎవరు వేసినా వాటికి అర్థం ఉండదు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రత్యర్ధుల మీద ఆరోపణలు చేసుకోవడమే గాని వాటిని నిరూపించుకునే బాధ్యత నాయకులు తీసుకోరు.

తెలంగాణలో (Telangana) అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో లోపాయికారి ఒప్పందం పెట్టుకొని పైకి ఒకరినొకరు తిట్టుకుంటున్నట్టు నటిస్తున్నారని కాంగ్రెస్ వారు ఆరోపిస్తున్నారు. అంటే బిజెపి, బీఆర్ఎస్ పేర్లలో, రూపంలో మార్పేగాని ఆత్మలో ఒకటేనని కాంగ్రెస్ వారి ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి పదేపదే ఈ ఆరోపణ చేస్తుంటారు. మరి ఈ ఆరోపణ ఎన్నికల కాలంలో ప్రజలు నమ్మితే, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ముస్లిం సముదాయం నమ్మితే, బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ. దీన్ని ఎలా తిప్పి కొట్టాలి అనేది పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ, బిజెపి ఒకటే అని చెప్పడానికి బీఆర్ఎస్ సాహసించలేదు. కారణం కాంగ్రెస్, బిజెపి చరిత్ర పొడవున బద్ధ శత్రువులుగానే కొనసాగారు. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు గాలికి వదిలేస్తే అవి చేయాల్సిన పని అవి చేసుకుపోతాయి.

We’re now on WhatsApp. Click to Join.

అందుకే కేటీఆర్ ఒక కొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు. తమలపాకుతో నువ్వు రెండంటే అరిటాకుతో నేను మూడంటాను అని సామెత చెప్పినట్టు, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణను ఆయన మీదకే ఎక్కుపెట్టి కేటీఆర్ ఒక కొత్త ఆరోపణ చేశారు. అదేమిటంటే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని, ఎన్నికలు పూర్తయ్యాక ఆయన తన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని కాషాయ దళంలో కలిసిపోతారని కేటీఆర్ ఒక విచిత్రమైన ఆరోపణ చేశారు. ఇక ఈ ఆరోపణను ఎంఐఎం నాయకులు గట్టిగా పట్టుకున్నారు. వారికెందుకు మధ్యలో అంటే కారణం మనకు తెలుసు కదా. ఎంఐఎం, బీఆర్ఎస్ తో బహిరంగంగానే పొత్తులో ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ముస్లిం సముదాయం విశ్వసిస్తే వాళ్లు బీఆర్ఎస్ కి ఎదురు తిరిగితే, బీఆర్ఎస్ తో పొత్తులో ఉన్న ఎంఐఎంకి కూడా అది వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డిని ఇరికించే పనిలో కేటీఆర్ తో పాటు ఎంఐఎం నాయకులు కూడా పడ్డారు.

రేవంత్ రెడ్డి పై కేటీఆర్ చేసిన ఆరోపణలో నిజం లేదని రేవంత్ నిరూపించుకోవాలని, భాగ్యలక్ష్మి దేవాలయానికి వచ్చి అక్కడ ప్రమాణం చేసి ప్రజల ముందు తనకూ ఆర్ఎస్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలని ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ సవాలు విసిరారు తాజాగా. చూశారా ఎంఐఎం నాయకులు కూడా బిజెపికి బీ-టీమ్ అని విమర్శలు ఎదుర్కొంటున్నారన్న విషయం మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. తెలంగాణలో (Telangana) ఎంఐఎం వారు కేవలం హైదరాబాదులో మాత్రమే పోటీ చేస్తారు. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా పోటీ చేయరు. ఎందుకంటే అలా పోటీ చేస్తే తాము పొత్తుతో ఉన్న బీఆర్ఎస్ కు నష్టం. ముస్లింలు తమకు ఓటు వేస్తే అది బీఆర్ఎస్ కు ఏమాత్రమయినా నష్టం చేసే అవకాశం ఉంటుంది. అందుకని అలా ఎంఐఎం నాయకులు ఇక్కడ పోటీ చేయరు. కానీ దేశంలో మాత్రం అనేకచోట్ల పోటీ చేస్తారు.

అలా పోటీ చేయడం వల్ల బిజెపికి వ్యతిరేకంగా ఏకమయ్యే ముస్లిం ఓట్లు ప్రతిపక్షాలకు తర్జుమా కాకుండా, వాటిని ఎంఐఎం కైవసం చేసుకుని కొద్దో గొప్పో బిజెపి వ్యతిరేక ఓట్లు చీల్చి బిజెపికి ప్రయోజనం చేకూర్చే పనిని చేస్తున్నట్టు ఎంఐఎం విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో అసలు ఎవరు బిజెపితో ఏ విధంగా అంట కాగుతున్నారు అనే విషయంపై ప్రజలు గందరగోళంలో పడిపోతున్నారు. బిజెపికి అనుకూలంగా బిఆరెస్, బిజెపికి అనుకూలంగా ఎంఐఎం వ్యవహరిస్తున్నాయన్న విమర్శలున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా ముద్ర వేయడానికి ఇటు బీఆర్ఎస్ నాయకులు, అటు ఎంఐఎం నాయకులు కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నారు.

చూశారా.. రాజకీయం ఎంత చిత్రంగా ఉంటుందో! ఇప్పుడు తెలంగాణలో బిజెపి మినహా మూడు ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం- ఈ మూడూ ఒకరిని ఒకరు పోటా పోటీగా నువ్వు బిజెపి మనిషివంటే.. నువ్వు బిజెపి మనిషివని ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మరి ప్రజల సంగతి ఏం కావాలి? ఎవరు ఎవరి పక్షాన ఏ రూపంలో పనిచేస్తున్నారు.. ఎవరి మాటల్లో ఎవరి ప్రయోజనాలు ఏ విధంగా నెరవేరుతున్నాయి.. అంతా ప్రజలకు గందరగోళంగా ఉంది. అసలు ఇలాంటి గందరగోళాన్ని సృష్టించి ప్రజల్ని అయోమయంలో పడేసి నయానో భయానో తమ వైపు తిప్పుకోవడమే రాజకీయ పార్టీల మహారాజకీయం. తెలంగాణలో ఇప్పుడు ఈ ఆరోపణల ప్రత్యారోపణల పర్వం సాగుతోంది. ఏది ఏమైనా దీనిలో ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణలో బిజెపితో ఫలానా వారు పరోక్షంగా పొత్తులో ఉన్నారని చెప్పడం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. అంటే తెలంగాణలో బిజెపి పరిస్థితి ఎంత ఒంటరిదయిందో మనకు అర్థమవుతోంది.

Also Read:  Pawan Kalyan – Junior Ntr : జూనియర్ ఎన్టీఆర్ పై జనసేనాని పరోక్ష కామెంట్స్.. నెట్టింట చర్చ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • congress
  • hyderabad
  • Leaders
  • politics
  • telangana

Related News

Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్, జనసేన మధ్య నెలకొన్న వివాదం చల్లారడం లేదు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్, జనసేన నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. వాటికి కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నె

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

  • Sister of Women's Commission Chairperson Gadwal Vijayalakshmi goes missing.

    Gadwal Vijaya Laxmi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి అదృశ్యం

Latest News

  • Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

  • Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

  • G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

Trending News

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd