BREAKING: గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల..
- By Kavya Krishna Published Date - 10:30 AM, Wed - 14 February 24

ఏపీలో గ్రూప్-2 (Group-2) అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) తీపికబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్-2 హాల్టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అయితే.. గ్రూప్-2లో 899 పోస్టుల కోసం 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఒరిజినల్ గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని APPSC సూచించింది. అయితే.. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్క్రీనింగ్ పరీక్ష (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) నిర్వహించనున్నట్లు APPSC పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లా కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నామని APPSC వెల్లడించింది. తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు అరగంట ముందుగానే చేరుకోవాలని APPSC సూచించింది. అలాగే.. Group-2 పరీక్ష వాయిదా అంటూ వస్తున్న వదంతులను అభ్యర్థులు ఎవరూ నమ్మ వద్దని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం యథాతథంగా పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
గత డిసెంబరు 7వ తేదీన ఏపీలో ఖాళీగా ఉన్న 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ(APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. మొత్తం 899 ఖాళీల్లో 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులు ఉండగా.. 846 కొత్త ఖాళీలు ఏర్పాడ్డాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్ (Executive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్ (Non Executive) పోస్టులు ఉన్నట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఏపీపీఎస్సీ, అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/లో చెక్ చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా.. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడండి.
Also Read : TS Assembly : అసెంబ్లీలో ఇరిగేషన్‌పై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం