HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Akbaruddin Owaisis Big Warning To Hyderabad Police

Hyderabad Police: ఓల్డ్ సిటీలో పోలీసుల దౌర్జన్యాలపై హైకోర్టుకు వెళ్తా: అక్బరుద్దీన్ ఒవైసీ

పాతబస్తీలో పోలీసుల వైఖరిపై హైకోర్టును ఆశ్రయిస్తామని, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం ఎవరైనా ఇంటి బయట నిలబడటం లేదా తిరగడం తప్పా అని ప్రశ్నించారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 29-07-2024 - 9:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Police
Hyderabad Police

Hyderabad Police: హైదరాబాద్ లో పోలీసులు రెచ్చి పోతున్నారు. తప్పు చేసిన వారిని పట్టుకోవడం పక్కనపెడితే అమాయకుల మీద చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మహిళలను వేదించే పోకిరీలను పట్టుకోకుండా రాత్రి సమయంలో రోడ్లపై కనిపించిన ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ఘటనలు రోజు చోటు చేసుకుంటున్నాయి.ఇటీవల కాలంలో పాతబస్తీలో అనేక సంఘటనలు వెలుగు చూశాయి. యువతని అసభ్యకర పదజాలంతో తిడుతూ లాఠీ ఛార్జ్ చేస్తున్న పరిస్థితి. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. పోలీసులా రౌడీలా అన్నట్టు ఉంది ఖాకీల ప్రవర్తన.

పాతబస్తీలో పోలీసుల వైఖరిపై హైకోర్టును ఆశ్రయిస్తామని, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం ఎవరైనా ఇంటి బయట నిలబడటం లేదా తిరగడం తప్పా అని ప్రశ్నించారు. అమాయకులు ఇళ్ల బయట ఉన్నా కూడా పోలీసులు లాఠీచార్జి చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కోర్టులో పిఐఎల్ దాఖలు చేస్తాను అని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమీషనర్ కార్యాలయం ముందు హోటల్ తెరిచి ఉంది. అయితే హోటల్‌ నుంచి లంచాలు వస్తున్నాయి కాబట్టి హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవట్లేదా అంటూ మండిపడ్డారు.

లాఠీ కల్చర్‌ను అమలు చేయడంలో కమిషనర్ టాస్క్‌ఫోర్స్ సహకారాన్ని హైలైట్ చేస్తూ, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించడానికి టాస్క్‌ఫోర్స్‌ను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. బదులుగా టాస్క్ ఫోర్స్ ప్రజలను రాత్రిపూట పడుకోమని బలవంతం చేయడంలో బిజీగా ఉంది అని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. పోలీసుల వైఖరి ఇలానే నేను కొనసాగితే పాతబస్తీలోనే నిలబడతానని, అప్పుడు జరిగే పరిణామాలను ప్రభుత్వమే ఎదుర్కోవాలని, అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

నగరంలో పెరుగుతున్న నేరాల రేటును నియంత్రించాలని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ ప్రభుత్వాన్ని కోరారు. పోలీసులు నేరస్తుల నుంచి మామూళ్లు వసూళ్లు చేస్తూ అమాయకులను పోలీసింగ్ పేరుతో చితక్కొడుతున్నారని అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌కి మామూల్ వస్తుంది . నేను ఎవరికీ భయపడను. నేను ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నానని వ్యవస్థపై మండిపడ్డారు ఒవైసి.

Also Read: AP Government : ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ సర్కార్ సిద్ధం..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • akbaruddin owaisi
  • High Court
  • hyderabad
  • Old City
  • police
  • Public
  • telangana

Related News

Bail granted to Bandi Bhagirath.

Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథకు లీగల్ పరంగా పెద్ద ఉపశమనం లభించింది. భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గురువారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం హైకోర్టు తుది తీర్పు

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd