HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >332 Km Regional Ring Road For Hyderabad Says Ktr

Hyderabad: హైదరాబాద్ కి 332 కి.మీ రీజినల్ రింగ్: కేటీఆర్

హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ పరిశ్రమలు నగరానికి క్యూ కడుతుండటంతో నగరం విదేశీ తరహాలో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్ మధ్య 332 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డుతో కొత్త అభివృద్ధి ప్రాజెక్ట్ కు ప్రణాళికలను రచిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 14-11-2023 - 3:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad (6)
Hyderabad (6)

Hyderabad: హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ పరిశ్రమలు నగరానికి క్యూ కడుతుండటంతో నగరం విదేశీ తరహాలో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్ మధ్య 332 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డుతో కొత్త అభివృద్ధి ప్రాజెక్ట్ కు ప్రణాళికలను రచిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని మళ్ళీ అధికారంలోకి రాగానే పూర్తి సినిమా చూపిస్తామని కేటీఆర్ చెప్పారు. ఐదు కేంద్రీకృత రింగ్ రోడ్లు కలిగిన బీజింగ్ వంటి గ్లోబల్ సిటీలుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని అన్నారు. 20 పట్టణాలను జాతీయ రహదారులతో కలుపుతూ జనాభాలో 40 శాతం మందిని కవర్ చేసే రీజనల్ రింగ్ రోడ్‌ త్వరలో ముందుకు తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో బిల్డర్లపై ప్రత్యేక పన్ను విధిస్తుందని ఎద్దేవా చేశారు. భవనాల అనుమతులను క్రమబద్ధీకరించే లక్ష్యంతో TS-Bpass వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌పై దృష్టి కేవలం మౌలిక సదుపాయాలపైనే కాకుండా ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పురోగతిపైనే ఉందన్నారు. చాలా కాలంగా భారతదేశ ఐటీ హబ్‌గా పరిగణించబడుతున్న బెంగళూరు నగరాన్ని కూడా అధిగమించి, ఐటీలో తెలంగాణ సాధించిన వృద్ధి గురించి కేటీఆర్ మాట్లాడుతూ, గత ఏడాది దేశంలో 4.50 లక్షల ఐటీ ఉద్యోగాలు నెలకొల్పితే హైదరాబాద్‌లో 1.50 లక్షలు మరియు బెంగళూరులో 1.46 లక్షల ఉద్యోగాలు వచ్చాయని మంత్రి చెప్పారు.

కాంగ్రెస్ గత తొమ్మిదళ్ల పాలనలో బీఆర్‌ఎస్ పనిచేసినట్లుగా చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ఉండేదన్నారు కేటీఆర్. మరోవైపు తెలంగాణ రైతులను అప్పుల ఊబిలోకి నెట్టింది కాంగ్రెస్సేనని అన్నారు. 2014కు ముందు 5 ఎకరాల భూమి ఉన్న రైతుకు వ్యవసాయం చేసేందుకు సరైన సౌకర్యాలు లేక అప్పులపాలయ్యారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువ పెరిగింది. దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని అన్నారు.

Also Read: Thummala : తుమ్మల సంచలన కామెంట్స్..నేను గెలిస్తే ఏపీలో బాబు గెలిచినట్లే..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 332 km
  • brs
  • congress
  • hyderabad
  • Inner Ring Road
  • IT Development
  • ktr
  • Outer Ring Road
  • Regional Ring Road
  • telangana

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

  • Kalvakuntla Kavitha lashes out at KTR.

    kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

Latest News

  • Kavya Maran wedding: కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి ఫిక్స్

  • Indian Army Recruitment: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

  • kavitha: ఎన్నికల సంఘానికి కల్వకుంట్ల కవిత కీలక లేఖ

  • CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd