HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >29 Flood Affected Districts In The State Cs Shanti Kumari

CS Shanti Kumari: రాష్ట్రంలో 29 వరద ప్రభావిత జిల్లాలు: సీఎస్

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్య దర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, వికాస్ రాజ్ లతోపాటు పలువురు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

  • Author : Gopi Date : 07-09-2024 - 7:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Instructions Of CS
Instructions Of CS

CS Shanti Kumari: తెలంగాణ‌ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వ‌ల‌న‌ 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) తెలిపారు. ఇప్పటికే నాలుగు జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించి వెంటనే తగు సహాయ పునరావాస చర్యలు చేపట్టేందుకు నిధులను సంబంధిత జిల్లా కలెక్టర్లకు విడుదల చేయడం జరిగిందని, అదేవిధంగా మిగిలిన 25 జిల్లాలకు మూడు కోట్ల రూపాయల చొప్పున సంబంధిత జిల్లా కలెక్టర్లకు నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై సవివర నివేదికను సోమవారం మధ్యాహ్నంలోగా సమర్పించాలని కోరుతూ శుక్ర‌వారం రాత్రి జిల్లా కలెక్టర్లతో సి.ఎస్. టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్య దర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, వికాస్ రాజ్ లతోపాటు పలువురు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీల మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల నమోదైన వర్షపాతం ఆధారంగా ఈ 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటించినట్టు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల మినహా అన్ని జిల్లాలను వర్ష ప్రభావిత జిల్లాలుగా ప్రకటించినట్టు వివరించారు. ఈ జిల్లాలకు వెంటనే తగు తక్షణ పునరావాస చర్యలను చేపట్టేందుకు జిల్లాకు మూడు కోట్ల రూపాయలను విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని శాంతి కుమారి తెలిపారు.

Also Read: Central Govt Releases Rs. 3300 Cr : కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాలేదు – CM చంద్రబాబు

SDRF నియమ నిబంధనలను అనుసరించి ఈ నిధులను వ్యయం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై, చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు, అందించాల్సిన సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన సోమవారం నాడు ఉన్నతస్థాయి సమావేశాన్నిఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వరదలు వర్షాల జరిగిన నష్టాల వివరాలను నిర్ణీత నమూనాలో సమర్పించేందుకుగాను జిల్లాల వారీగా సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 29 మంది మరణించారని వీరికి ఎక్స్ గ్రేషియా అందించేందుకు వివరాలు పంపాలని తెలిపారు.

జిల్లాల వారీగా జరిగిన పంట నష్టం, పాడి పశువుల మరణాలు, ఇతర వ్యవసాయ సంబంధిత నష్టాల వివరాలతో పాటు దెబ్బతిన్న రాష్ట్ర, జిల్లా, పంచాయతీ రహదారుల వివరాలు, దెబ్బతిన్న కల్వర్టులు బ్రిడ్జిలు, పాఠశాల భవనాలు, తాగునీటి సరఫరా పైప్ లైన్ ల వివరాలతో కూడిన నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 29 Districts
  • CM Revanth Reddy
  • CS Shanti Kumari
  • flood-affected districts
  • floods
  • Shanti Kumari
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd