Vivo T4 5G: వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన వివో.. మార్కెట్లోకి మరో సరికొత్త మాత్రం రిలీజ్!
వివో సంస్థ ఇప్పుడే వినియోగదారులకు గుడ్ న్యూస్ ని చెబుతూ మార్కెట్లోకి మరోసారి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ ఏది ధర ఎంత అన్న వివరాల్లోకి వెళితే..
- By Anshu Published Date - 11:03 AM, Fri - 18 April 25

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది వివో. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లతో వినియోగదారుల దృష్టిని మరింత ఆకర్షిస్తోంది. ఇక వివో నుంచి విడుదల అయ్యే స్మార్ట్ ఫోన్ల కోసం వినియోగదారులు కూడా ఎదురుచూస్తున్నారు. వివో టీ4 5జీ ఏప్రిల్ 22న భారతదేశంలో లాంచ్ కానుంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని భావిస్తున్నారు.
ఇది 6.67 అంగుళాల FHD+ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చట. ఈ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 32ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. ఇది 7,300mAh బ్యాటరీతో వచ్చే అవకాశం ఉందట. అలాగే 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వవచ్చు. భారతదేశంలో వివో టీ4 5జీ ధర దాదాపు INR 25,000 ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి కేవలం కొన్ని లీకులు మాత్రమే బయటకు వచ్చాయి.
ఇటీవల కాలంలో తరచూ కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ ని పొందడం విడుదల చేస్తూ వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకుంటూ పోతుంది వివో సంస్థ. ఇక త్వరలోనే అనగా ఏప్రిల్ 22న విడుదల కాబోతున్న ఈ కొత్త వివో ఫోన్ కోసం కూడా అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఫోన్ ఎలా ఉండబోతోంది అందులో ఫీచర్లు ఏమిటి అన్న వివరాలు తెలియాలి అంతే మరి కొద్ది రోజులు వచ్చి చూడాల్సిందే.