HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Social Media Like Instagram And Facebook To Get Paid For Verification

Social Media: పక్కా కమర్షియల్ బాట పట్టిన సోషల్ మీడియా!

ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ వినియోగదారులు ఇప్పుడు బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం

  • Author : Maheswara Rao Nadella Date : 21-02-2023 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
WhatsApp
WhatsApp

ఒకప్పుడు సోషల్ మీడియాలో (Social Media) బ్లూటిక్ ఉందంటే వారు సెలబ్రిటీ కిందనే లెక్క. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. నెలకు రూ.రెండు వేల వరకు ఖర్చు పెట్టుకునే స్థోమత ఉంటే చాలు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో దర్జాగా సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకోవచ్చు (కొనుక్కోవచ్చు). మొదట ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ పేరుతో వెరిఫికేషన్ టిక్‌కు నగదు వసూలు చేయగా, ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు కూడా అదే బాట పట్టనున్నట్లు మెటా ప్రకటించింది. ఈ విషయంలో మెటాకు ట్విట్టర్ ఆదర్శం అని చెప్పవచ్చు.

ఒకప్పుడు సోషల్ మీడియా (Social Media) యాప్‌లలో బ్లూ టిక్ సెలబ్రిటీలకు ఉచితంగా లభించేది. కానీ ఇప్పుడు అలా కాదు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ డబ్బు చెల్లించి సోషల్ మీడియా యాప్‌లలో బ్లూ టిక్ పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా బ్లూ టిక్‌ల కోసం ట్విట్టర్ ‘ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్’ని ప్రారంభించింది. ఇప్పుడు దీని తర్వాత మెటా తన ఉత్పత్తులకు పెయిడ్ వెరిఫికేషన్ సర్వీసును కూడా ప్రకటించింది. అంటే ఇప్పుడు మీరు డబ్బు చెల్లించి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్‌లను సులభంగా పొందవచ్చు.

ఎంత డబ్బు చెల్లించాలి?

మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఇప్పుడు మెటా కూడా పెయిడ్ వెరిఫికేషన్ సర్వీసును ప్రారంభించనుంది. వెబ్ వినియోగదారులు ప్రతి నెలా 11.99 డాలర్లు అంటే మనదేశ కరెన్సీలో రూ. 982, ఐవోఎస్ వినియోగదారులు 14.99 డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 1,240 ఖర్చు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ సర్వీస్ ఆండ్రాయిడ్ కోసం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కోసం సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఇప్పుడే ప్రారంభం అయింది. ఇది క్రమంగా ఇతర దేశాలలో కూడా ప్రారంభం అవుతుంది.

బ్లూ టిక్ కోసం ట్విట్టర్ ఎంత ఖర్చు పెట్టాలి?

బ్లూ టిక్ కోసం ట్విట్టర్ వెబ్ వినియోగదారుల నుంచి నెలకు రూ.650, ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారుల నుంచి రూ.900 వసూలు చేస్తుంది. ఇక్కడ గమనించాల్సంది ఏంటంటే Facebook, Instagramలో మీరు ప్రభుత్వ ఐడీ ద్వారా మీ ఖాతాను ధృవీకరించాలి. దీంతోపాటు నగదు కూడా చెల్లించాలి. మొదట చెల్లింపు చేసిన తర్వాత, మీరు బ్లూ టిక్ కోసం ఐడీని సబ్మిట్ చేయాలి.అయితే మీరు ట్విట్టర్‌లో అయితే చెల్లింపు చేసిన వెంటనే బ్లూ టిక్ పొందుతారు. మెటా పెయిడ్ వెరిఫికేషన్ సర్వీస్ వ్యక్తిగత అకౌంట్ల కోసం మాత్రమే విడుదల చేసింది. ఇది పేజీల కోసం కాదు. ఈ పెయిడ్ సర్వీసును కొనుగోలు చేసే వారికి మెరుగైన కస్టమర్ సపోర్ట్, సెక్యూరిటీ లభిస్తుంది.

Also Read:  Burning Sensation in Chest: ఛాతీలో మంటగా ఉందా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • Facebook
  • instagram
  • pay
  • technology
  • Verification
  • viral

Related News

LPG Cylinder

ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

పిఎన్‌జి కస్టమర్లు తమ ఎల్‌పిజి కనెక్షన్‌ను తప్పనిసరిగా సరెండర్ చేయాల్సి ఉంటుందని లేదా దానిని 'ఇన్‌యాక్టివ్' మోడ్‌లోకి మార్చాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

  • Instagram

    ఇన్‌స్టాగ్రామ్ వాడేవారికి బిగ్ అప్డేట్‌!

  • Passport Visa New Rule

    విదేశీయులకు గుడ్ న్యూస్ చెప్పిన భార‌త్‌!

  • LPG Crisis

    ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

  • Jagan Fever Attack

    AP Development : ఏపీ అభివృద్ధికి జగన్ అనే ‘గ్రహణం ‘ అడ్డు ?

Latest News

  • Donald Trump : ట్రంప్ కు మరో భారీ షాక్

  • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

  • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

  • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

  • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

Trending News

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd