Poco C55: మార్కెట్ లోకి సరికొత్త పోకో స్మార్ట్ ఫోన్.. ధర,ఫీచర్స్ ఇవే?
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం
- By Nakshatra Published Date - 07:00 AM, Mon - 20 February 23
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనేఉంది. వినియోగదారుల అభిరుచుల మేరకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది. అంతేకాకుండా అతి తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పోకో సంస్థ భారత మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. పోకో ఎస్55 పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది పోకో సంస్థ.
ఇకపోతే ఈ పోకో ఎస్55 స్మార్ట్ ఫోన్ ఫీచర్ లు, ధర విషయానికొస్తే ఇందులో.. 6.71 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. 20:6:9 యాస్పెక్ట్ రేషియో, 500 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ తో లభించనుంది. కాగా ఇక ఈ ఫోన్లో ఓక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ చిప్సెట్ అండ్ మాలీ జీ52 జీపీయూను అందించనున్నారు. ఎల్పీడీడీఆర్4ఎక్స్ రామ్, ఈఎంఎంసీ 5.1 ఫ్లాష్ మెమొరీ కూడా రానుంది. కాగా ఈ సార్ట్ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ సామర్థ్యంను కలిగిఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ధరకి సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌తో వస్తోన్న ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు. అలాగే ఈ ఫోన్లో 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ 128 స్టోరేజ్ కెపాసిటీతో తీసుకొచ్చారు. అయితే ఈ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఈ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ధర తక్కువగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.