WhatsApp Update : వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై మెసేజ్ స్క్రీన్‌పైనే స్టేటస్ అప్‌డేట్స్.. అదెలా అంటే?
ఇప్పటికే పదుల సంఖ్యలో అప్డేట్లను తీసుకువచ్చిన వాట్సాప్ (WhatsApp) సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్లను తీసుకువస్తూ వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది.
- By Naresh Kumar Published Date - 05:20 PM, Tue - 21 November 23

WhatsApp Status New Feature Update : ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఇప్పటికే పదుల సంఖ్యలో అప్డేట్లను తీసుకువచ్చిన వాట్సాప్ (WhatsApp) సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్లను తీసుకువస్తూ వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా వాట్సాప్ సంస్థ వినియోగదారులకు మరో శుభవార్తను తెలిపింది. యూజర్స్ కోసం మరో సరికొత్త అప్డేట్ ని తీసుకువచ్చింది.
We’re Now on WhatsApp. Click to Join.
మరి ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా వాట్సాప్ మేసేజింగ్ స్క్రీన్ నుంచి నేరుగా స్టేటస్ అప్‌డేట్‌లను వీక్షించడానికి వినియోగదారులను అనుమతించడానికి కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ సరికొత్త ఫీచర్ ప్రస్తుతం కేవలం ఆండ్రాయిడ్ పరికరాలలో బీటా టెస్టర్‌ల కోసం అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఈ అప్డేట్ కి సంబంధించి మరిన్ని వివల్లోకి వెళితే.. వాట్సాప్ (WhatsApp) అందిస్తున్న కొత్త ఫీచర్‌తో స్టేటస్ అప్‌డేట్‌లను చూడటానికి వినియోగదారులు ఇకపై వివిధ ట్యాబ్‌ల మధ్య మారాల్సిన అవసరం లేదు.
దానికి బదులుగా వారు నేరుగా సంభాషణ స్క్రీన్‌లో స్టేటస్ అప్‌డేట్‌లను చూడగలరు. పైన యాప్ బార్‌లోని ప్రొఫైల్ ఫోటో చుట్టూ స్టేటస్ రింగ్ ద్వారా సూచిస్తుంది. ఈ మార్పు వినియోగదారులకు సున్నితమైన, మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వారి సంభాషణలకు అంతరాయం కలగకుండా వారి పరిచయాల కార్యకలాపాలపై నవీకరించడానికి వారిని అనుమతిస్తుంది. ఈ ఫీచర్ తో పాటుగా మరికొన్ని ఫీచర్లు త్వరలో తీసుకోవాలని ఉంది వాట్సాప్ సంస్థ. అయితే ప్రస్తుతం ఆ ఫీచర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయి.
Also Read: Producers vs Reviewers : సినిమా రివ్యూస్ పై ఇండస్ట్రీ కాల్.. ఎవరిది కరెక్ట్..!