Whip on Social Media: టిక్ టాక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లపై ఫ్రాన్స్ ప్రభుత్వం కొరడా
ఫ్రాన్స్ ప్రభుత్వం TikTok, Twitter, Instagram సహా పలు యాప్స్ పై కొరడా ఝుళిపించింది. ప్రభుత్వ ఉద్యోగులు వీటిని ఫోన్ లో కూడా వాడొద్దని ఆదేశించింది.
- By Maheswara Rao Nadella Published Date - 05:00 PM, Sun - 26 March 23

Whip on Social Media : ఫ్రాన్స్ ప్రభుత్వం TikTok, Twitter, Instagram సహా పలు యాప్స్ పై కొరడా (Whip) ఝుళిపించింది. ప్రభుత్వ ఉద్యోగులు వీటిని ఫోన్ లో కూడా వాడొద్దని ఆదేశించింది. ఈ యాప్ లలోని భద్రతా లోపాల కారణంగా తాజా నిర్ణయం తీసుకున్నామని ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించింది. ఫ్రెంచ్ మంత్రి స్టానిస్లాస్ గెరిని ఈవిషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిషేధాన్ని ఫ్రాన్స్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ పర్యవేక్షిస్తుందన్నారు. నిషేధ జాబితాలో Twitter, Instagram, నెట్‌ఫ్లిక్స్, గేమింగ్ యాప్ క్యాండీ క్రష్, డేటింగ్ యాప్‌లు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే యుఎస్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఇయు) కూడా ప్రభుత్వ సిబ్బంది ఫోన్‌లలో టిక్‌టాక్‌ను నిషేధించాయి.
ఒక మినహాయింపు..
ఒక అధికారి పబ్లిక్ కమ్యూనికేషన్ వంటి వృత్తిపరమైన ప్రయోజనాల కోసం నిషేధిత యాప్‌ను ఉపయోగించాలనుకుంటే, వారు అలా చేయడానికి అనుమతిని కోరవచ్చు.
TikTok పై డౌట్ ఎందుకు?
చైనా అధికారులు TikTok ద్వారా ఫోన్లను హైజాక్ చేస్తాయనే ఆందోళన యూరప్ దేశాలు, అమెరికాకు ఉంది. 2017లో చైనా అమలు చేసిన చట్టం ప్రకారం దేశ జాతీయ భద్రతకు సంబంధించిన ఏదైనా వ్యక్తిగత డేటాను చైనా కంపెనీలు చైనా ప్రభుత్వానికి అందించాలి. TikTok అటువంటి డేటాను మార్చినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. కానీ అది సేకరిస్తున్న విస్తారమైన వినియోగదారు డేటా కారణంగా భయాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇండియాలో..
భారత్ లోనూ టిక్ టాక్ యాప్ పై 2020లోనే వేటుపడిన సంగతి తెలిసిందే. టిక్ టాక్ కు భారత్ అతిపెద్ద మార్కెట్ గా ఉండడమే కాదు. భారీగా యూజర్లను ఆకర్షించే తరుణంలో నిషేధానికి గురైంది. గల్వాన్ లోయ దాడి తర్వాత భారత్ టిక్ టాక్ సహా వందలాది చైనా యాప్ లను నిషేధించి గట్టి బదులిచ్చింది.
Also Read: PAN & Aadhaar Link: పాన్, ఆధార్ లను లింక్ చేయకపోతే ప్రభుత్వానికి అదనపు పన్నులు చెల్లించాల్సి రావచ్చు