Amazfit Band 7: అమేజ్‌ఫిట్ బ్యాండ్ 7.. ధర ఫీచర్లు ఇవే?
ప్రముఖ వేరబుల్ బ్రాండ్ అమేజ్ ఫిట్ తాజాగా ఫిట్నెస్ బ్యాండ్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఈ అమేజ్ ఫిట్
- By Anshu Published Date - 03:13 PM, Sat - 5 November 22
ప్రముఖ వేరబుల్ బ్రాండ్ అమేజ్ ఫిట్ తాజాగా ఫిట్నెస్ బ్యాండ్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఈ అమేజ్ ఫిట్ బ్యాండ్ 7ను ఈనెల అనగా నవంబర్ 8 వ తేదీన మార్కెట్ లోకి విడుదల చేయనుంది. కాగా ఈ బ్యాండ్ 7, 18 రోజులపాటు బ్యాటరీ లైఫ్ ఇవ్వనుంది. కాగా ఇందులో మొత్తం 120 స్పోర్ట్స్ మోడ్స్, వైడ్ డిస్ ప్లేతో బ్యాండ్ 7 కస్టమర్లకు ముందుకు రానుంది. ఈ బ్యాండ్ 7 కి సంబంధించిన ధరను కూడా అమేజ్ ఫిట్ ఇప్పటికే ప్రకటన చేసింది.
నవంబర్ 8న మార్కెట్ లోకి రానున్న ఈ బ్యాండ్ 7 ధర రూ.2,999 గా ఉంది. అయితే ఈ బ్యాండ్ 7 ను లాంచ్ చేసిన తరువాత దాని ధరను రూ.3,499 కు పెంచనున్నట్టు అమేజ్ ఫిట్ వెల్లడించింది. ఇకపోతే ఈ బ్యాండ్ 7 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 1.47 ఇంచ్ హెచ్ డీ అమోల్డ్ డిస్ ప్లే ను ఇవ్వనున్నారు. ఇక దీని బరువు విషయానికి వస్తే దీనిని బరువు కేవలం 28 గ్రాములు మాత్రమే ఉండనుంది. కాగా ఈ బ్యాండ్ 7 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉండడంతో దీనిని స్విమ్మింగ్,బాతింగ్ సమయంలో కూడా ధరించవచ్చు.
కాగా ఈ బ్యాండ్ అమెజాన్ తో పాటుగా అమేజ్ ఫిట్ అధికారిక వెబ్ సైట్ లో కూడా అందుబాటులో ఉంది. అమేజ్ ఫిట్ బ్యాండ్ 7 లో ఎస్ ఓ పి, హార్డ్ రేట్, స్ట్రెస్ లెవెల్స్, అలాగే ట్రాకింగ్ వంటి పలు హెల్త్ ఫీచర్ లను కూడా అందించనున్నారు.