Pm Modi
-
#India
PM Modi : టారిఫ్ ఉద్రిక్తతల వేళ.. అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ..!
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెలాఖరులో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాల్లో పాల్గొనడానికి మోడీ అమెరికా వెళ్లనున్నారు.
Published Date - 09:10 AM, Wed - 13 August 25 -
#India
Metro Yellow Line : బెంగళూరులో మోడీ పర్యటన..వందే భారత్ రైళ్లు, మెట్రో ప్రారంభోత్సవాలు
ప్రధాని మోడీ, కొత్తగా ప్రారంభించిన బెంగళూరు-బెళగావి వందే భారత్ రైల్లో ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. టెక్నాలజీ, అభివృద్ధి, యువత భవిష్యత్తుపై చర్చిస్తూ వారిని ప్రోత్సహించారు. విద్యార్థుల స్ఫూర్తిదాయక ప్రశ్నలకు మోదీ సమాధానాలు ఇచ్చారు.
Published Date - 02:09 PM, Sun - 10 August 25 -
#Telangana
BCs reservation : బీసీ రిజర్వేషన్ల అమలుకు మా వద్ద 3 మార్గాలు : సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం గురువారం సాయంత్రం వరకు వేచి చూస్తామని వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆమె స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు. అయితే ఆమె అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒత్తిడి వల్లేనని భావించాల్సి ఉంటుందన్నారు.
Published Date - 01:42 PM, Thu - 7 August 25 -
#India
Tariffs : ఎలాంటి ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు..ట్రంప్ టారిఫ్‌ల పై స్పందించిన ప్రధాని మోడీ
రైతుల సంక్షేమం మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. దేశంలోని దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడుతోంది. వారి ప్రయోజనాల కోసం ఏదైనా ఒప్పందాన్ని త్యజించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ, రైతుల జీవితాలపై ప్రమాదం వచ్చే విధంగా ఎలాంటి విదేశీ ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు.
Published Date - 10:57 AM, Thu - 7 August 25 -
#India
PM Modi Visit China: చైనాకు వెళ్తున్న ప్రధాని మోదీ.. కారణమిదే?
SCO సమ్మేళనంలో పాల్గొనేందుకు చైనాకు వెళ్లే ముందు ప్రధానమంత్రి మోదీ జపాన్ను సందర్శిస్తారు. ఆగస్టు 30న జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాతో వార్షిక శిఖర సమ్మేళనంలో పాల్గొంటారు.
Published Date - 08:42 PM, Wed - 6 August 25 -
#India
PM Modi : దేశాభివృద్ధికి మరో అడుగు..ఢిల్లీలో ‘కర్తవ్య భవన్’ ప్రారంభించిన ప్రధాని మోడీ
ఇది సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద సిద్ధమయ్యే మొత్తం 10 కార్యాలయ భవనాల్లో మొదటిది కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..దేశ రాజధానిలో పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగంగా కొనసాగిస్తోంది.
Published Date - 02:14 PM, Wed - 6 August 25 -
#India
Rahul Gandhi : భారత్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు.. మోడీ మౌనం అందుకేనా?: రాహుల్ గాంధీ ఎద్దేవా
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీపై ధ్వజమెత్తారు. అమెరికాలో అదానీపై విచారణ జరుగుతున్న సమయంలోనే ట్రంప్ ఇలా భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. మోడీ ఎందుకు స్పందించడం లేదు? ఆయన చేతులు కట్టేసారా? అని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో పోస్టు చేశారు.
Published Date - 01:16 PM, Wed - 6 August 25 -
#India
NDA Meet : ఇటువంటి ప్రతిపక్ష నేతలను ఇంకెక్కడా చూడలేదు: ప్రధాని మోడీ
ప్రధాని మోడీ మాటల్లోనే, విపక్షాల గొంతులు గట్టిగా వినిపించినా, వాస్తవాలను ఎదుర్కొనే నైతిక బలవంతం వారి వద్ద లేదన్నారు. చర్చల సమయంలో విపక్ష నేతల్లో కూడా ఒక్కరితో ఒకరు ఏకాభిప్రాయానికి రాలేకపోయిన దృష్టాంతాలు స్పష్టంగా కనిపించాయన్నారు. “ఇటువంటి ప్రతిపక్ష నాయకత్వాన్ని దేశం ఎన్నడూ చూడలేదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 01:00 PM, Tue - 5 August 25 -
#India
NDA : ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం.. ప్రధానికి సన్మానం, ఎంపీలకు సూచనలు
పార్లమెంటులో విపక్షాల ధ్వనితో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రతిష్టంభన మధ్యలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి మోడీ పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలు, శాసనసభలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపై ఎలా స్పందించాలో ఎన్డీఏ ఎంపీలకు సూచనలు చేశారు.
Published Date - 10:41 AM, Tue - 5 August 25 -
#India
Ind vs Pak Match: జవాన్ల రక్తం కంటే బీసీసీఐకి డబ్బే ముఖ్యం.. ఎంపీ సంచలన ఆరోపణలు!
శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై కేంద్ర ప్రభుత్వం, భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Published Date - 11:42 AM, Sun - 3 August 25 -
#India
PM Modi : ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ స్పందన..భారత్ ‘డెడ్ ఎకానమీ’ కాదు..మూడో అతిపెద్ద ఆర్థిక శక్తి
భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నదని, ఆ మార్గంలో వేగంగా సాగుతోందని మోడీ స్పష్టంగా చెప్పారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
Published Date - 01:32 PM, Sat - 2 August 25 -
#India
PM Kisan : పీఎం కిసాన్ నిధుల విడుదల.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ నిధులను విడుదల చేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ విడతలో కేంద్రం రూ.20వేల కోట్లను జారీ చేసింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.
Published Date - 12:15 PM, Sat - 2 August 25 -
#India
US Tariff: భారతదేశంపై 25 శాతం సుంకం స్టార్ట్.. ఈ రంగంపై భారీ ఎఫెక్ట్!
వ్యాపారుల అభిప్రాయం ప్రకారం.. తమ ఫ్యాక్టరీలను కాపాడుకోవడానికి, పెద్ద సంఖ్యలో కార్మికులను తొలగించకుండా ఉండటానికి వారు తమ వస్తువులను ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువ ధరకు విక్రయించాల్సి ఉంటుంది.
Published Date - 11:12 AM, Sat - 2 August 25 -
#India
PM Kisan : రైతులకు శుభవార్త.. రేపు పీఎం కిసాన్ పథకం నిధులు విడుదల
ఈ మొత్తాన్ని దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9.7 కోట్ల మంది అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ నిధుల విడుదలకు సంబంధించిన కార్యక్రమం వారాణసిలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మోడీ వర్చువల్ విధానంలో రైతుల ఖాతాల్లో నిధులు బదిలీ చేయనున్నారు.
Published Date - 10:46 AM, Fri - 1 August 25 -
#India
PM Modi : 127 ఏండ్ల తర్వాత భారత్‌కు బుద్ధుని అవశేషాలు
ఈ చారిత్రక సంఘటన మన దేశ సాంస్కృతిక పరంపరకు, ఆధ్యాత్మిక తేజానికి గర్వకారణం అని ప్రధానమంత్రి మోడీ వెల్లడించారు. గౌతమ బుద్ధుడి అవశేషాలు మన దేశంతో ఆయనకున్న లోతైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తున్నాయని, ఆయన బోధనలు ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
Published Date - 10:54 AM, Thu - 31 July 25