Aishwaryarai: ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యరాయ్.. వీడియో ఇదే!
సత్యసాయి బాబా తరచుగా బోధించే ఐదు ముఖ్య లక్షణాలు (5-Ds) గురించి ఐశ్వర్య రాయ్ తన ప్రసంగంలో వివరించారు. అర్థవంతమైన, ప్రయోజనకరమైన, ఆధ్యాత్మికంగా స్థిరపడిన జీవితాన్ని గడపడానికి ఈ ఐదు లక్షణాలు అత్యంత అవసరమని గురువు చెప్పేవారని ఆమె గుర్తుచేశారు.
- By Gopichand Published Date - 04:17 PM, Wed - 19 November 25
Aishwaryarai: దివంగత ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకలు బుధవారం పుట్టపర్తిలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ చారిత్రక వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించడానికి వచ్చిన సినీ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ (Aishwaryarai), ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడం విశేషం.
ఈ వేదికపై ప్రధానమంత్రి మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
బాల వికాస్ పూర్వ విద్యార్థినిగా ఐశ్వర్య ప్రసంగం
సత్యసాయి బాల వికాస్ కార్యక్రమం పూర్వ విద్యార్థిని అయిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆమె తన ప్రసంగంలో సత్యసాయి బాబా బోధనల గొప్పతనాన్ని స్మరించుకున్నారు. “ఒక శతాబ్దం కాలం గడిచినప్పటికీ.. మన గురువు అమూల్యమైన బోధనలు, మార్గదర్శకత్వం, అపారమైన కరుణ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తుల హృదయాలలో నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి” అని ఆమె అన్నారు.
Also Read: Anand Mahindra : చంద్రబాబు అన్‌స్టాపబుల్..ఆనంద్ మహీంద్రా సంచలనం..!
ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు హాజరు కావడంపై ఐశ్వర్య ప్రత్యేకంగా ప్రస్తావించారు. “మీరు ఇక్కడ హాజరు కావడం ఈ శత జయంతి వేడుకలకు పవిత్రతను, గొప్ప స్ఫూర్తిని జోడించింది. నిజమైన నాయకత్వం సేవయే, మానవ సేవయే మాధవ సేవ అన్న స్వామి సందేశాన్ని మీ ఉనికి మరింత పటిష్టం చేసి, అందరికీ గుర్తు చేస్తుంది” అని ఆమె ప్రధానిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
సత్యసాయి బోధించిన 5-డిల ప్రాధాన్యత
సత్యసాయి బాబా తరచుగా బోధించే ఐదు ముఖ్య లక్షణాలు (5-Ds) గురించి ఐశ్వర్య రాయ్ తన ప్రసంగంలో వివరించారు. అర్థవంతమైన, ప్రయోజనకరమైన, ఆధ్యాత్మికంగా స్థిరపడిన జీవితాన్ని గడపడానికి ఈ ఐదు లక్షణాలు అత్యంత అవసరమని గురువు చెప్పేవారని ఆమె గుర్తుచేశారు. ఆ ఐదు లక్షణాలు
- క్రమశిక్షణ (Discipline)
- అంకితభావం (Dedication)
- భక్తి (Devotion)
- సంకల్పం (Determination)
- వివేకం (Discrimination)
Aishwarya Rai Bachchan touches feet of PM Modi… ❤️ pic.twitter.com/6zpZKbqMrt
— Mr Sinha (@MrSinha_) November 19, 2025