HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Dna Test Confirms Umar Nabi Was Driving Car In Delhi Blast Say Police Sources

Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌న విష‌యం!

దాడికి పాల్పడిన వ్యక్తి డాక్టర్ ఉమర్ అని దర్యాప్తు సంస్థలు మొదటి నుంచీ అనుమానిస్తున్నాయి. ఉమర్ పేలుడు జరగడానికి కేవలం 11 రోజుల ముందు ఈ దాడికి ఉపయోగించిన తెలుపు రంగు హ్యుందాయ్ ఐ20 కారును కొనుగోలు చేశాడు.

  • By Gopichand Published Date - 09:45 AM, Thu - 13 November 25
  • daily-hunt
Delhi Blast
Delhi Blast

Delhi Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన ఘోరమైన పేలుడు (Delhi Blast) దర్యాప్తు పురోగమిస్తున్న కొద్దీ ప్రతిరోజూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం వెల్లడైంది. దీని ద్వారా ఇది పూర్తిగా ప్రణాళికాబద్ధమైన ఉగ్రదాడి అని దాదాపుగా నిర్ధారణ అయింది. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం బుధవారం అర్ధరాత్రి ధృవీకరించిన వివరాల ప్రకారం.. పేలుడు పదార్థాలతో నిండిన హ్యుందాయ్ ఐ20 కారులో ఉన్న వ్యక్తి మరెవరో కాదు ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ (ఉమర్ మొహమ్మద్) అని తేలింది. కారు శిథిలాల నుంచి లభించిన కాలిపోయిన మృతదేహం DNA టెస్ట్ ఫలితం ఉమర్ కుటుంబ సభ్యుల నమూనాలతో 100% మ్యాచ్ అయింది.

మొదటి నుంచీ అనుమానం

దాడికి పాల్పడిన వ్యక్తి డాక్టర్ ఉమర్ అని దర్యాప్తు సంస్థలు మొదటి నుంచీ అనుమానిస్తున్నాయి. ఉమర్ పేలుడు జరగడానికి కేవలం 11 రోజుల ముందు ఈ దాడికి ఉపయోగించిన తెలుపు రంగు హ్యుందాయ్ ఐ20 కారును కొనుగోలు చేశాడు. ఫరీదాబాద్‌లోని ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’లో ఉమర్ కీలక సభ్యుడు. పుల్వామాలోని సంబూరా నివాసి అయిన ఉమర్ కుటుంబ సభ్యులను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు.

ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్.. ఉమర్ తల్లి, సోదరుడి నుండి DNA నమూనాలను సేకరించింది. పేలుడులో ఉపయోగించిన కారు శిథిలాల నుంచి లభించిన అవశేషాలు (ఎముకలు, దంతాలు, బట్టల ముక్కలు) ఈ నమూనాలతో సరిపోయాయి. DNA నమూనా మ్యాచ్ అవడంతో కారును ఉమరే నడుపుతున్నాడని ఖచ్చితమైంది.

Also Read: Railway New Rule: పిల్లలతో క‌లిసి రైలు ప్రయాణం చేసేవారికి గుడ్‌న్యూస్!

భయంతో తొందరపడి పేల్చేశాడు

ఉమర్ భద్రతా ఏజెన్సీలకు భయపడి తొందరపాటులో కారుతో పాటు తనను తాను కూడా పేల్చుకున్నట్లు తెలుస్తోంది. ఉమర్ మత మౌఢ్యంతో మారాడని కుటుంబ సభ్యులకు ముందే తెలుసని, అయితే వారు ఈ విషయాన్ని భద్రతా ఏజెన్సీలకు చెప్పలేదని వర్గాలు తెలిపాయి. ఉమర్ టర్కీలోని అంకారాలో ఉన్న తన హ్యాండ్లర్ ‘UKasa’ (కోడ్‌నేమ్ అయ్యే అవకాశం ఉంది)తో ‘సెషన్ యాప్’ ద్వారా నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నాడు.

టర్కీ రాయబార కార్యాలయం సహకారం కోరిన NIA

వర్గాల సమాచారం ప్రకారం.. మార్చి 2022లో కొంతమంది వ్యక్తులు భారత్ నుండి అంకారాకు వెళ్లారు. వీరిలో ఉమర్‌తో పాటు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో పట్టుబడిన ఇతర అనుమానితులు కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అదే సమయంలో వారికి బ్రెయిన్ వాష్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దీనిని ధృవీకరించడానికి న్యూఢిల్లీలోని టర్కీ (తుర్కియే) రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. ఈ విషయంలో సహకారం కోరింది. దీంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశంలో ప్రభుత్వం ఢిల్లీ కారు పేలుడును ‘ఉగ్రదాడి’గా ప్రకటించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Delhi Blast
  • DNA Test
  • pm modi
  • Red Fort Explosion
  • Umar Nabi

Related News

Vladimir Putin

Vladimir Putin: ప్రధాని మోదీ ఒత్తిడికి లొంగే నాయకుడు కాదు: వ్లాదిమిర్ పుతిన్

భారత్, రష్యా మధ్య సహకారం పరిధి చాలా విస్తృతంగా ఉన్నందున చర్చించడానికి చాలా అంశాలు ఉన్నాయని పుతిన్ చెప్పారు. రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యే క చారిత్రక సంబంధాలను కూడా ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

  • President Putin

    President Putin: పుతిన్ ఎక్కువ‌గా డిసెంబర్ నెల‌లోనే భారత్‌కు ఎందుకు వ‌స్తున్నారు?

  • Telangana Global Summit

    Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలను క‌లిసిన సీఎం రేవంత్‌!

  • PM Modi AI Video

    PM Modi AI Video: ప్ర‌ధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయ‌టం క‌రెక్టేనా?!

  • Powerful Officers

    Powerful Officers: ప్రధానికి అత్యంత సన్నిహితులు ఈ అధికారులే.. మొత్తం వ్యవస్థపై పట్టు వీరిదే!!

Latest News

  • Putin Staying Suite: ఐటీసీ మౌర్యలో కట్టుదిట్టమైన భద్రత.. పుతిన్ కోసం ‘చాణక్య సూట్’ సిద్ధం, ప్ర‌త్యేక‌త‌లీవే!

  • Akhanda 2 : తెలంగాణ లో ఈరోజు రాత్రి 8 గంటల నుండే అఖండ 2 ప్రీమియర్స్ ..టికెట్స్ ధరలు ఎలా ఉన్నాయంటే !!

  • Gambhir- Agarkar: టీమిండియాను నాశ‌నం చేస్తున్న అగార్క‌ర్‌, గంభీర్!

  • Gannavaram : రూ. 90 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ

  • RCB: ఆర్సీబీ జ‌ట్టును కొనుగోలు చేయ‌బోయేది ఇత‌నేనా?!

Trending News

    • Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా ఆట‌గాడు!!

    • India Squad: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భార‌త్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్ ఎవ‌రంటే?

    • Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్.. ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

    • Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!

    • Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd