Medicine Price : 900 రకాల మెడిసన్ ధరలను సవరించిన కేంద్రం..
పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయని జాతీయ ఔషధ ధరల అథారిటీ స్పష్టం చేసింది.
- By Latha Suma Published Date - 12:45 PM, Tue - 1 April 25

Medicine Price : 900 పైగా రకాల మెడిసిన్ ధరలను కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ఔషధ ధరల అథారిటీ సవరించింది. గుండె సంబంధిత, డయాబెటిస్, క్రిటికల్ ఇన్‌ఫెక్షన్లకు సంబంధించిన మెడిసిన్లపై సైతం గరిష్టంగా 1.74 శాతం వరకు ధరలు పెరిగాయి. గత ఏడాదిలో పోలిస్తే ఈ సంవత్సరం WPI 0.00551 శాతం అధికంగా ఉంది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయని జాతీయ ఔషధ ధరల అథారిటీ స్పష్టం చేసింది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఔషధాల ధరలు 0.00551 శాతం పెరిగాయి. ఇది వార్షిక మార్పు ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఔషధాల ధరల నియంత్రణ చట్టం DPCO, 2013 యొక్క పేరా 2(1)(u)లో పేర్కొన్న విధంగా NPPA కొత్త ఔషధాల రిటైల్ ధరను కూడా నిర్ణయిస్తుందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు. ప్రతి సంవత్సరం టోకు ధరల సూచిక (WPI) ఆధారంగా NPPA అవసరమైన ఔషధాల ధరలను సవరిస్తుంటుంది. ‘ ఔషధాల (ధరల నియంత్రణ) చట్టం 2013 (DPCO, 2013) నిబంధనల ప్రకారం.. షెడ్యూల్ చేసిన ఔషధాల ధరలు హోల్‌సేల్ ధరల సూచిక (WPI) ఆధారంగా ఏటా సవరిస్తారు.
నొప్పి నివారణ మెడిసిన్ డైక్లోఫెనాక్ టాబ్లెట్ రూ.2.09 సీలింగ్ ధరను కలిగి ఉంది. ఇబుప్రోఫెన్ టాబ్లెట్లు దాని 200 mg రూ.0.72, 400 mg డోసేజ్ రూ.1.22 ధర అయింది. యాంటీబయాటిక్ కోసం వాడే అజిత్రోమైసిన్ 250 ఎంజీకి 11.87 రూపాయలు, 500 ఎంజీ గ్రాముల డోసెజ్ ట్యాబ్లెట్ కు రూ.23.98 అయింది. ఔషధ ధరల నియంత్రణ సంస్థ.. 2023లో ఇదే సమయంలో 2024 సంవత్సరంతో పోల్చితే WPIలో వార్షిక మార్పు (+) 1.74028 శాతం వరకు పెరిగిందని ఓ ప్రకటనలో తెలిపింది.
కొన్ని ముఖ్యమైన మెడిసిన ధరల సవరణ ఇలా..
. అమోక్సిసిలిన్, క్లావులానిక్ యాసిడ్ కలిగిన డ్రై సిరప్ ధర ఒక్క ఎంఎల్‌కు రూ2.09 గా నిర్ణయించారు.
.డైక్లోఫెనాక్ (పెయిన్ కిల్లర్) టాబ్లెట్‌కు గరిష్ట ధర రూ.2.09 అయింది.
.ఇబుప్రోఫెన్ (పెయిన్ కిల్లర్): 200 mg: టాబ్లెట్‌కు రూ.0.72, 400 mg టాబ్లెట్‌కు రూ.1.22.
. డయాబెటిస్ మందులు (డపాగ్లిఫ్లోజిన్ + మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ + గ్లిమెపిరైడ్) టాబ్లెట్‌కు రూ.12.74.
.ఎసిక్లోవిర్ (యాంటీవైరల్) టాబ్లెట్ 200 mg: టాబ్లెట్ ధర రూ.7.74, 400 mg: టాబ్లెట్‌కు రూ.13.90.
. హైడ్రాక్సీక్లోరోక్విన్ (యాంటీమలేరియల్): 200 mg టాబ్లెట్‌కు రూ.6.47, 400 mg టాబ్లెట్‌కు రూ.14.04.
.జ్వరం, చెవి, కంటి, ముక్కు, అనస్తీషియా, గుండె, డయాబెటిస్, విటమిన్ టాబ్లెట్ల ధరలు పెరిగాయి. బేర్ మెటల్ స్టెంట్లపై గరిష్ట ధరను రూ. 10,692.69కి సవరించగా.. బయోరిసోర్బబుల్ వాస్కులర్ స్కాఫోల్డ్ (BVS)/ బయోడిగ్రేడబుల్ స్టెంట్, డ్రగ్-ఎలుటింగ్ స్టెంట్ ధర రూ. 38,933.14గా ఫిక్స్ చేశారు.
Read Also: Kakani Govardhan Reddy : కాకాణి గోవర్థన్ కు మరో షాక్