HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Heritage Shares Plummeted Suddenly Resulting In A Loss Of Over Rs 80 Crore For Chandrababus Wife

ఒక్కసారిగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు.. చంద్రబాబు సతీమణికి రూ. 80 కోట్లకుపైగా లాస్!

  • Author : Vamsi Chowdary Korata Date : 29-01-2026 - 1:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Family
Chandrababu Family

Heritage Company  భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం సెషన్‌లోనూ ఒడుదొడుకుల్లోనే ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఇవాళ ఇంట్రాడేలో 10 శాతం వరకు తగ్గడంతో ఇన్వెస్టర్లకు నష్టాలు వస్తున్నాయి. ఇదే సమయంలో సంస్థ ప్రమోటర్లుగా ఉన్న నారా భువనేశ్వరి, నారా లోకేష్‌ సంపద కూడా ఆవిరైంది. క్యూ3లో బలహీన ఫలితాల నేపథ్యంలో షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

భారత్- యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. గత 2 రోజులు దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు తీవ్ర ఒడుదొడుకుల్ని దాటుకొని రాణించగా.. ఇది రెండు రోజుల మురిపెమే అయిపోయింది. గురువారం సెషన్‌లో మళ్లీ భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో భారీ నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఇప్పుడు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. వార్త రాసే సమయంలో (మధ్యాహ్నం 12.30 గంటలకు) బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టంతో 82,100 స్థాయిలో కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్లకుపైగా పతనంతో ప్రస్తుతం 25,250 మార్కుపైన కొనసాగుతోంది. పలు హెవీ వెయిట్ స్టాక్స్ పతనం అవుతున్నాయి.

మార్కెట్లు పతనం అవుతున్న నేపథ్యంలో దేశంలోని ప్రముఖ డెయిరీ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ షేరు భారీగా పతనం అవుతోంది. కిందటి రోజు రూ. 396.65 వద్ద ముగిసిన హెరిటేజ్ ఫుడ్స్ షేరు ఇవాళ నేరుగా 7 శాతానికిపైగా నష్టంత రూ. 368 వద్ద ఓపెన్ అయింది. అక్కడితో ఆగకుండా మళ్లీ ఇంట్రాడేలో 10 శాతం వరకు నష్టపోయి రూ. 358.20 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 9 శాతం నష్టంతో రూ. 360 స్థాయిలో ఉంది.

ఈ సంస్థ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 3.37 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 540 గా ఉండగా.. అక్కడి నుంచి చూస్తే దాదాపు 35 శాతం తగ్గింది. ఇక స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ. 352.10 గా ఉండగా.. దానికి ఇప్పుడు సమీపించిందని చెప్పొచ్చు. జనవరి 28న హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. ఇక్కడ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. సంస్థ నికర లాభం ఏకంగా 20 శాతం వరకు తగ్గి రూ. 34.5 కోట్లుగా వచ్చింది. ఆదాయం స్వల్పంగా 8.2 శాతం పెరిగి రూ. 1119.1 కోట్లుగా నమోదైంది. ఈ క్రమంలోనే లాభం తగ్గడంతో.. ఇన్వెస్టర్లు ఈ షేర్లను విక్రయిస్తుండటంతో అమ్మకాల ఒత్తిడి నెలకొన్నట్లు తెలుస్తోంది.

హెరిటేజ్ ఫుడ్స్ షేరు పతనంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. అయితే ఇక్కడ ఇన్వెస్టర్లే కాకుండా.. సంస్థ ప్రమోటర్లకు కూడా ఒక్కరోజులో భారీ నష్టాలు వచ్చాయని చెప్పొచ్చు. ఈ కంపెనీని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్థాపించినా ప్రస్తుతం ఆయనకు ఇందులో ఎలాంటి వాటా లేదు. పదవిలోనూ లేరు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి సంస్థకు వైస్ ఛైర్‌పర్సన్, ఎండీగా ఉండగా.. ఈమెకు ఇందులో 2025, డిసెంబర్ 31 నాటికి 24.37 శాతం వాటాకు సమానమైన 2,26,11,525 షేర్లు ఉన్నాయి. స్టాక్ ఇవాళ ఇంట్రాడేలో 10 శాతం వరకు పడిపోగా.. ఆమెకు ఒక్కరోజే ఏకంగా రూ. 86 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. మరో ప్రమోటర్, చంద్రబాబు- భువనేశ్వరి తనయుడు నారా లోకేష్ వాటా 10.82 శాతంగా ఉండగా.. మొత్తం షేర్లు 1,00,37,453 గా ఉండగా.. ఈయన సంపద రూ. 38 కోట్లకుపైగా సంపద తగ్గింది. లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణికి 4,30,952 షేర్లు ఉండగా.. ఈమెకు రూ. 4,30,952 నష్టం వచ్చింది. లోకేష్- బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్‌కు 56,075 షేర్లు ఉండగా.. రూ. 21 లక్షలకుపైగా నష్టం వచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu
  • AP CM Chandrababu Naidu
  • chandrababu heritage income
  • heritage company
  • Heritage Foods
  • Heritage Foods Profits
  • heritage milk
  • nara bhuvaneswari
  • nara brahmani
  • nara lokesh

Related News

International Thalassemia Day

Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆదివారం హైదరాబాద్‌లో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ‘తలసేమియా రన్’ను ఘనంగా నిర్వహించింది. జలవిహార్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ పరుగులో 3K, 5K, 10K విభా

  • Nara Lokesh

    AP ECET 2026 results: ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల : నారా లోకేశ్

  • Ap Transport Department

    ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్ 24 గంటల్లోపే వాహనాల రిజిస్ట్రేషన్‌

  • Varma

    Pithapuram వర్మపై టీడీపీ వేటు

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

Latest News

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd