HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Government Good News For Apsrtc Employees A Dream Come True

APSRTC : ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెరవేరిన కల..!

  • Author : Vamsi Chowdary Korata Date : 02-12-2025 - 12:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Apsrtc
Apsrtc

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్లను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది.. వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోకి ఎన్‌ఎంయూఏ, ఎంప్లాయిస్‌ యూనియన్లను కౌన్సిల్‌లో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ రెండు ప్రధాన సంఘాలకు కౌన్సిల్‌లో సభ్యత్వం మంజూరు చేసింది. ఈ మేరకు జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు సభ్యత్వం లభించడంతో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చల్లో ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాల్గొనే అవకాశం దక్కింది. ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్లు వంటి విషయాలపై తమ అభిప్రాయాలను, సమస్యలను సంఘాల నాయకులు ప్రభుత్వానికి చెప్పగలరు. ఇది ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై ఎన్‌ఎంయూఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు.. ఈయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సభ్యత్వం ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వారు ఆశిస్తున్నారు.

గతంలో ప్రభుత్వం నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ (ఎన్‌ఎంయూఏ), ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) సంఘాలను గుర్తించింది. అయితే తమకు రాష్ట్రస్థాయి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం కల్పించాలని రెండు సంఘాలు కోరాయి. స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం కల్పిస్తే.. ఆర్టీసీ ఉద్యోగులు వారి సమస్యలు, మిగిలిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వీలు ఉంటుందని రిక్వెస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగ సంఘాల వినతుల్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ రెండు సంఘాలకు సభ్యత్వం కల్పించింది.

మరోవైపు ఏపీఎస్‌ఆర్టీసీ ఆస్తుల తనఖా ఆలోచనను విరమించుకోవాలని సీపీఐ కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య లేఖ రాశారు. ఆర్టీసీకి చెందిన విలువైన భూములు, భవనాలు, డిపోలు, ఇతర స్థిరాస్తులను కార్పొరేట్‌ కంపెనీలకు లీజు, తనఖాకు ఇవ్వాలనే ప్రతిపాదనను విరమించుకోండి. రోడ్ల మరమ్మతుల కోసం ఆర్టీసీ ఆస్తులను తనఖా పెట్టాలనే నిర్ణయం ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది’ అంటూ లేఖలో ఈశ్వరయ్య ప్రస్తావించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • AP CM Chandrababu
  • apsrtc
  • Apsrtc Unions
  • civil services
  • Staff Council

Related News

ArcelorMittal Nippon Steel India secures land in Andhra Pradesh

ముహుర్తం ఖరారు.. మార్చి 23న అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..!

Arcelormittal Nippon Steel Plant Bhoomi Pooja In Anakapalli  ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం రూపురేఖలు మారబోతున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న మెగా స్టీల్‌ ప్లాంట్‌కు మార్చి 23న శంకుస్థాపన జరగనుంది. దాదాపు 60,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టున్నారు. ఈ పరిశ్రమ ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం

  • Massive Fire Accident In Amaravati

    అమరావతిపై మళ్లీ అవే కుట్రలు.. L&T పైపులకు నిప్పు…!!

  • Ap Liquor Prices

    మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

  • AI Services In AP Government Hospitals

    ఏపీలో 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవలు

Latest News

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

  • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd