Andhra Pradesh Politics
-
#Andhra Pradesh
Vidadala Rajini : ముందస్తు బెయిల్ కోసం హైకోర్టకు విడదల రజిని
Vidadala Rajini : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి విడదల రజిని తమపై నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ చిలకలూరిపేట సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పిళ్లి కోటి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని రజిని కోర్టుకు వెల్లడించారు. తాను నిర్దోషిని కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె పిటిషన్‌లో అభ్యర్థించారు.
Published Date - 11:45 AM, Tue - 11 February 25 -
#Andhra Pradesh
High Court : తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక.. హైకోర్టు కీలక ఆదేశాలు
High Court : "కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని, ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని" కోర్టు ఆదేశించింది. కార్పొరేటర్లు బయటకు బయలుదేరినప్పటి నుంచి సెనెట్ హాల్‌కు చేరుకునే వరకు వారి రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 06:05 PM, Mon - 3 February 25 -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబు గుజరాత్ మోడల్ వ్యాఖ్యల అర్థం ఇదా..?
CM Chandrababu : ఇటీవల తన ప్రసంగాల్లో సీఎం చంద్రబాబు గుజరాత్ మోడల్‌ను ప్రస్తావిస్తూ అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం ఎంత ముఖ్యమో వివరించారు. ఆయన గుజరాత్ మోడల్ గురించి రెండు, మూడు సార్లు చెప్పిన సందర్భాలు ప్రజలకు చర్చనీయాంశమయ్యాయి.
Published Date - 10:35 AM, Tue - 28 January 25 -
#Andhra Pradesh
Yuva Galam Padayatra : నేటికి యువగళానికి రెండేళ్లు.. అలుపెరగని యోధుడు నారా లోకేష్
Yuva Galam Padayatra : నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వ పునాదులను ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఈ పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని లేకుండా, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగింది టీడీపీనే అని ప్రజలు నమ్మినప్పటికీ, 2019 ఎన్నికల్లో వైసీపీ చేసిన ఆకర్షణీయ ప్రచార నినాదాలతో ప్రజలు ఆ పార్టీకి అధికారం అప్పగించారు.
Published Date - 02:08 PM, Mon - 27 January 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : ఆదాయం ప్రాతిపదికన గ్రేడ్లు.. పంచాయతీరాజ్ శాఖపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..
Pawan Kalyan : గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపాన్ని ఇవ్వాలని, ఆదాయ ప్రాతిపదికతో పాటు జనాభా ప్రాతిపదికనను కూడా తీసుకుంటూ కొత్త గ్రేడ్లు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త గ్రేడ్ల ఆధారంగా సిబ్బంది కేటాయింపు జరుగుతుందని, గ్రామ పంచాయతీ , సచివాలయ సిబ్బందితో సమన్వయంగా పని చేయాలని, దీనిపై సిఫార్సులు చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Published Date - 06:32 PM, Mon - 20 January 25 -
#Telangana
Harish Rao : సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కడం కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనకు నిదర్శనం
Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు కన్నీటి గోసను మిగిల్చిందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రుల మాటలు కోటలు దాటుతాయిగానీ ఆచరణ మాత్రం గడప దాటదని ఎద్దేవా చేశారు.
Published Date - 06:04 PM, Mon - 20 January 25 -
#Andhra Pradesh
Kiran Kumar Reddy : రాష్ట్ర విభజనపై కిరణ్‌కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Kiran Kumar Reddy : కిరణ్‌కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యతో ఆయన కొత్త చర్చకు తెరలేపారు. అనేక మంది "వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే రాష్ట్ర విభజన జరగదని" అనుకుంటున్నారని, కానీ 2009లోనే కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీలో 'తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం' అనే తీర్మానాన్ని పెట్టాలని భావించినట్లు కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పారు.
Published Date - 11:29 AM, Mon - 13 January 25 -
#Telangana
Padi Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు.. !
Padi Kaushik Reddy : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌తో వాగ్వాదం కారణంగా హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటన క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో కరీంనగర్ జిల్లాలోని రాజకీయాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారని సంజయ్ పీఏ ఫిర్యాదు చేయగా, కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు, సమావేశంలో గందరగోళం సృష్టించినందుకు మరో కేసు నమోదైంది.
Published Date - 10:20 AM, Mon - 13 January 25 -
#Andhra Pradesh
Ration Rice Scam : రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు..
Ration Rice Scam : ఏప్రిల్, మే నెలల్లో అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా, నిందితులు బియ్యాన్ని తరలించినట్లు అనుమానిస్తున్నారు. మినీ వ్యానులను ఉపయోగించినట్లు గుర్తించారు. గోడౌన్ మేనేజర్ మానస్ తేజతో సహా ఇతర నిందితులు 378.866 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారని పోలీసులు వెల్లడించారు.
Published Date - 07:39 PM, Thu - 9 January 25 -
#Andhra Pradesh
Payyavula Keshav: కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరం
Payyavula Keshav : ఆయన ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ "కన్నతల్లికి దణ్ణం పెట్టలేని జగన్, తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని" ఆయన విమర్శించారు.
Published Date - 07:03 PM, Sat - 4 January 25 -
#Andhra Pradesh
Shyamala : సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారు
Shyamala : వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల తన తాజా మీడియా సమావేశంలో టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.
Published Date - 05:04 PM, Sat - 4 January 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : సజ్జల ఆక్రమణలపై పవన్ సీరియస్.. చర్యలకు ఆదేశాలు
Pawan Kalyan : సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం అటవీ భూమిని ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నట్లు ఉన్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సీరియస్‌గా స్పందించారు. ఈ వ్యవహారం గురించి వెంటనే చర్యలు తీసుకోవాలని పవన్‌కల్యాణ్ కడప కలెక్టర్‌తో పాటు ఆ జిల్లా అటవీ అధికారులను ఆదేశించారు.
Published Date - 12:12 PM, Fri - 3 January 25 -
#Andhra Pradesh
Buddha Venkanna : బీసీల పక్షపాతి చంద్రబాబు.. డీజీపీ, సీఎస్ కీలక పోస్టుల్లో ఉన్న వాళ్లంతా బీసీలే
Buddha Venkanna : బీసీల ముద్దుబిడ్డ సీఎం చంద్రబాబు అని, వెనుకబడిన తరగతుల పక్షపాతి చంద్రబాబు అని పేర్కొన్నారు. బీసీల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రశంసలు కురిపించారు.
Published Date - 11:53 AM, Mon - 30 December 24 -
#Andhra Pradesh
RK Roja : చంద్రబాబు నాయుడు నిజానికి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు..!
RK Roja : ఈ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు నెలల్లోనే ప్రజలను దారుణమైన బాధలకు గురి చేసిందని ఆర్కే రోజా ఆరోపించారు. నగరిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళలు, విద్యార్థులు, యువతను మోసం చేయడంలో ఈ ప్రభుత్వం ముందుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 06:49 PM, Thu - 26 December 24 -
#Andhra Pradesh
Innovative Flexi : టాక్ ఆఫ్ ది టౌన్ ఏపీ రాజధానిలో ఫ్లెక్సీలు
Innovative Flexi : సోషల్ మీడియాను వ్యక్తిగత దూషణలకు, దుష్ప్రచారాలకు, మహిళలను అవమానించడానికి ఉపయోగిస్తున్నారని అధికార ఎన్డీఏ కూటమి తీవ్ర చర్యలకు దిగింది.
Published Date - 06:24 PM, Thu - 26 December 24